గంజాయి కేసులో గుప్తా అరెస్టు
ABN, First Publish Date - 2023-03-02T01:44:36+05:30
గంజాయి కేసులో సోమిశెట్టి సుబ్బారావుగుప్తాను అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు.
ఒంగోలు డీఎస్పీ నాగరాజు వెల్లడి
ఒంగోలు (క్రైం), మార్చి 1 : గంజాయి కేసులో సోమిశెట్టి సుబ్బారావుగుప్తాను అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. బుధవారం స్థానిక వెంకటేశ్వరకాలనీ అడ్డరోడ్డులో తాలూకా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గుప్తా మోటర్‌సైకిల్‌పై ఇంటి వద్ద నుంచి వస్తూ పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించాడన్నారు. ఆ సమయంలో తాలూకా ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో వెంటాడి అతనిని పట్టుకున్నారన్నారు. తనిఖీ చేయగా బైక్‌లోని సంచీలో ఒక కిలో ఐదు గ్రాముల గంజాయి దొరికిందని తెలిపారు. ఈ మేరకు తాలూకా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణలో గంజాయి ఎక్కడి నుంచి తెస్తుంది, ఎవరికి సరఫరా చేస్తుంది అనే అంశాలు వెల్లడి కావాల్సి ఉందన్నారు.
Updated Date - 2023-03-02T01:44:36+05:30 IST