ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2023-03-30T22:36:21+05:30

మండలంలోని భీమ వరంలో రూ.1.80కోట్ల వ్యయంతో నూత నంగా నిర్మించిన శ్రీ కోదండ రా మాలయ ప్రతిష్ఠ, విగ్రహ మహోత్సవం గురువారం కనులపండువగా జరిగింది.

ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భీమవరంలో సంబరాల వాతావరణం

ముండ్లమూరు, మార్చి 30 : మండలంలోని భీమ వరంలో రూ.1.80కోట్ల వ్యయంతో నూత నంగా నిర్మించిన శ్రీ కోదండ రా మాలయ ప్రతిష్ఠ, విగ్రహ మహోత్సవం గురువారం కనులపండువగా జరిగింది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తుల రామనామ స్మరణ నడుమ ధ్వజ స్తంభం, నాభిశిలను ప్రతిష్ఠించారు. ఆల యంలో సీతారామ లక్ష్మ ణ స్వామి, అభయాం జనేయ స్వామి విగ్రహా లను ప్రతిష్ఠించారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. గ్రామానికి చెం దిన స్వర్గీయ వీర గంధం సుబ్బారావు కుమా రుడు వీరగంధం భాన రూ.15 లక్షల విరా ళంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్థులతో పాటు బంధువులు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న వారు పెద్ద మొత్తంలో విరాళాలను అంద జేశారు. భీమవరంతో పాటు ఈదర, బొప్పూడివారిపాలెం, పూరిమెట్ల, జమ్మలమడక, మక్కెన వారిపాలెం, ఉమా మహేశ్వర అగ్రహారం, మారెళ్ళ, పెద ఉల్లగల్లు, ముండ్లమూరు, పల్నాడు జిల్లా వినుకొండ, నూజెండ్ల, ద ర్శి, అద్దంకి, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, హైదదాబాద్‌, బెంగ ళూరు, చెన్నై ప్రాంతాలకు చెందిన చేస్తున్న వారు సైతం గ్రామానికి చేరుకొని మహో త్సవంలో పాల్గొన్నారు. పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామానికి చెందిన ప్రధాన ప్రతిష్ఠాచా ర్యులు పిచ్చయ్య శాస్త్రి, వారి కుమారుడు అశిత్‌ శర్మ ఆధ్వర్యంలో 18 మంది రుత్వికులు కార్యక్ర మాన్ని పూర్తిచేశారు. ముందుగా యాగశాలలో గ్రామానికి చెందిన భక్తులు హోమంలో పాల్గొన్న అనంతరం గోమాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దిశెట్టి శ్రీధర్‌, శ్రీధర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-03-30T22:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising