ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా హనుమజ్జయంతి

ABN, First Publish Date - 2023-05-15T00:35:13+05:30

ఎర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం సాయంత్రం హిందువుల ఆధ్వర్యంలో హనుమాన్‌ శోభాయాత్ర ర్యాలీ వైభవంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగొండపాలెం, మే 14 : ఎర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం సాయంత్రం హిందువుల ఆధ్వర్యంలో హనుమాన్‌ శోభాయాత్ర ర్యాలీ వైభవంగా నిర్వహించారు. హనుమజ్జయంతి సందర్భంగా హనుమాన్‌ శోభాయాత్ర స్థానిక రామాలయం నుంచి పట్టణపురవీధుల నుంచి పట్టణ శివారు వరకు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో హిందువులు పాల్గొని డిజే సౌండ్‌ సిస్టంలో ఆంజనేయ భక్తిగేయాలు ఆలపించారు. యువతీ, యువకులు నృత్యప్రదర్శన, గేయాలాపన చేశారు. పెద్దలు, యువతి, యువకులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : శ్రీ హనుమాన్‌ జయంతిని పురస్క రించుకుని ఆదివారం మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధా నంగా స్థానిక శ్రీలక్ష్మీ నరసింహా స్వామి దేవాలయంలో ఆవరణలోని ఆంజనేయస్వామి దేవాలయంలో, గణపతి చెక్‌పోస్టు వద్ద అభయాంజనేయ స్వామి దేవాలయంలో, ఐనముక్కుల, తిమ్మాపురం ఆంజనేయస్వామి దేవాలయంలో, హసనాబాద్‌ దేవాలయంలో ఆయా ఆల యాల కమిటీల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అంజనీ పుత్రునికి సింధూరంతో అలంకరించి ఆకుపూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించారు.

తిమ్మాపురంలో ఎడ్ల బలప్రదర్శన

హనుమజ్జయంతి సందర్భంగా మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో కంభం మండలం సూరె పల్లె గ్రామానికి చెందిన సీతారెడ్డి ఎడ్లజత 2,151 అడుగులు లాగి ప్రథమ బహుమతిని కైవశం చేసుకొన్నాయి. తిమ్మాపురం గ్రామానికి చెందిన మండ్ల కాశిరాములు ఎడ్లు 1023 అడుగులు లాగి ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నాయి. తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగెపోగు ఏసయ్య ఎడ్లు 1,000 అడుగులు లాగి తృతీయ బహుమతిని పొందాయి. మొదటి బహుమతి రూ.20,000లు నల్లబోతుల వెంకటేశ్వర్లు అందజేయగా, ద్వితీయ బహుమతి రూ.10,000లు గ్రామ కమిటి అందజేసింది. తృతీయ బహుమతి రూ.5,000లు పరిమిశెట్టి చిన్న వెంకటయ్య అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకట సుబ్బయ్య, ఎం.బాలకాశయ్య, నల్లబోతులు కాశిరాములు, రావిక్రింది పుల్లారావు, రామిశెట్టి క్రిష్ణయ్య పాల్గొన్నారు.

బేస్తవారపేట : మండలంలో హనుమజ్జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీఆంజనేయస్వామి దేవాలయాల్లో ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. దరగా వెళ్లే దారిలోని బృగమహేశ్వరస్వామి దేవాలయంలో హనుమజ్జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహాలకు ఆకు పూజచేసి నైవేథ్యం పెట్టారు.

కంభం : మండలంలో హనుమజ్జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి, శ్రీకాళింగ ఆంజనేయస్వామి దేవాలయం,కందులాపురం పంచాయతీలోని నెహ్రునగర్‌లోని పట్టాభిరామస్వామి దేవాలయంలో, అర్ధవీడు మండలంలోని పలు గ్రామాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. స్వామివారికి ఆకుపూజ చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

గిద్దలూరు : హనుమాన్‌ జయంతి వేడుకలను గిద్దలూరు ప్రాంత ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గిద్దలూరులో ఆంజనేయస్వామి దేవస్థానం, వీహెచ్‌పీ సంయుక్త ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఆదివారం ఉదయం ప్రధానవీధుల నుంచి భక్తులు బైక్‌ ర్యాలీ నిర్వహించగా సాయంత్రం పాదయాత్రలు నిర్వహించారు. నరవ రోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జరిగిన హనుమాన్‌ జయంతి వేడుకల్లో, అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పన పాల్గొన్నారు. మండలంలోని సంజీవరాయునిపేట గ్రామంలోని శ్రీఅభయాంజనేయస్వామి దేవాలయంలో హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. దాతలు సమకూర్చిన వెండి కిరీటం, హస్తం స్వామి వారికి అలంకరించారు. ఆయా కార్యక్రమాలలో దేవస్థాన కమిటీ ప్రతినిధులు రామచంద్రుడు, నాగేశ్వరరావు, వాసవిక్లబ్‌ ప్రతినిధులు శ్రీకాంత్‌, సుబ్బారావు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : హనుమజ్జయంతి సందర్భంగా హనుమాన్‌ శోభాయాత్రను మండల కేంద్రంలో ఆది వారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్బంగా మహిళా భక్తులు, ఆర్యవైశ్య యువకులు, హిందూదర్మ పరిరక్షణ సమితి, వీహెచ్‌పీ ఆద్వర్యంలో జండాలు చేతపట్టి ద్విచక్ర వాహనాలు సహాయంతో, ట్రాక్టరుపై ఆంజనేయుడి ప్రతిమను ఊరేగించారు. వైపాలెం కూడలిలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రధాన రహదారి గుండా బ్రహంగారికాలనీ, ఆర్టీసీ బస్టాండు, ఉత్తరపు బజారు, పాత రామాలయం నుంచి పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీ నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం వడపప్పు, ప్రసాదాలు పంపిణీ చేశారు.

పొదిలి : హనుమాన్‌ జయంతిని మండల ప్రజలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని కాటూరివారిపాలెం, మోలూరు పంచా యతీలోని మూసీవాగు సమీపంలో, కంభాలపాడు, పట్టణంలోని విశ్వనాధపురంలోని దేవాలయాల్లో స్వామి వారికి భక్తులు ఉదయం నుంచి బారులు తీరి పూజలు నిర్వహించారు. అనంతరం ఆకుపూజ ప్రారంభించి స్వామివారికి కాయాకర్పూరం సమర్పించి ప్రసాదాలు పంచిపెట్టారు. పాతూరులో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయంలో ముందుగా పట్టణంలో చినబస్టాండ్‌ నుంచి పెద్దబస్టాండ్‌, ఆర్టీసీ డిపో, విశ్వనాథపురం మీదుగా ఆంజనేయస్వామి గుడివరకు వరకు హనుమాన్‌ శోభాయాత్ర బైక్‌ర్యాలీని నిర్వహిం చారు. అనంతరం అన్ని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : పట్టణంలో హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా ఆదివారం నిర్వహించారు. స్థానిక తర్లుపాడు రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. 30 అడుగుల హనుమంతుని విగ్రహం ప్రత్యేక వాహనంపై ఉంచి యా త్ర నిర్వహించారు. అడుగడుగునా జైశ్రీరామ్‌ నినాదాలు, కోలాటాలు, కర్రసాము వివిధ ప్రదర్శనలతో శోభాయాత్ర పట్టణ వీధులలో సాగింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం వద్ద భక్తులకు గంగాజలం పంపిణీ చేశారు.

చందనాలకారంలో వాయునందనుడు

మార్కాపురం వన్‌టౌన్‌ : పట్టణంలోని కంభం రోడ్డులో వెలసిన నాగులపుట్ట వీరాంజనేయస్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆది వారం అర్చకులు నారాయణం త్రివిక్రమం ప్రసాద్‌, ఆసూరి రాఘవాచార్యులు ఆంజనేయస్వామికి సుప్రభాత సేవ, పంచాభిమృత అభిషేకం, నాగవళ్లి దళార్చణ నిర్వహించారు. ఆంజనేయుడి మూలవిరాట్‌కు చందనా లకారం చేశారు. అనంతరం సువర్చలసమేత వీరాంజ నేయస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఆలయ గౌరవ అధ్యక్షులు యక్కలి కాశీవిశ్వనాదం, అధ్యక్ష, కార్యదర్శులు నూకల శ్రీనివాసరావు, గోపిశెట్టి కొండయ్య, కోశాధికారి టి.ఆదినారాయణ, సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

కొమరోలు : స్థానిక వీరాంజనేయస్వామి దేవాల యం లో ఆదివారం హనుమజ్జయంతిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్వామి వారికి ఉదయం పూలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దంప తులతో ఆకుపూజ నిర్వహించారు. స్వామి సన్నిధిలో భక్తులు హనుమన్‌ఛాలిసా పఠించారు. అనంతరం ఉపాద్యాయులు మాదాల సిద్దయ్య, మరియాల రమేష్‌లు అన్నదాన కార్యాక్రమాన్ని నిర్వహించారు.

ఎర్రగొండపాలెం : మండలంలోని గ్రామాల్లోని ఆంజనేయస్వామి విగ్రహాల వద్ద ఆదివారం భక్తులు హనుమజ్జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. ఆంజనేయస్వామి విగ్రహాలకు భక్తులు తమలపాకులతో దండలు వేసి భక్తితో పూజలు నిర్వహించారు. ఎర్రగొండపాలెం సువర్చలా సమేత ప్రసనాంజనేయస్వామి ఆలయంలో భక్తులు హనుమత్‌ వ్రతం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదములు పంపిణీ చేశారు. మండలంలోని మొగుళ్లపల్లి, వీరభద్రాపురం, గోళ్ళవీడపి, అయ్యంబోట్లపల్లి బోయలపల్లి, గుర్రపుసాల, తమ్మడపల్లి కొలుకుల, వెంకటాద్రిపాలెం గ్రామాల్లో హనుమజ్జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి భక్తి గేయాలతో వీరహనుమాన్‌ పేరును భక్తులు పఠించి పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-05-15T00:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising