పీసీపల్లిలో గాలివాన
ABN, First Publish Date - 2023-04-02T22:32:18+05:30
మండలంలోని ప లు గ్రామాల్లో ఆది వారం గాలివాన బీ భత్సం సృష్టించింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 3.30గంటల వరకు తీవ్రమైన ఎండ కా సింది.
నేలకొరిగిన స్తంభాలు, చెట్లు
రాలిపోయిన బత్తాయి
పీసీపల్లి, ఏప్రిల్ 2 : మండలంలోని ప లు గ్రామాల్లో ఆది వారం గాలివాన బీ భత్సం సృష్టించింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 3.30గంటల వరకు తీవ్రమైన ఎండ కా సింది. 4గంటల స మయంలో మబ్బులు పట్టి ఆకాశం మేఘా వృతమైంది. చిరుజల్లులతో వర్షం మొదలైంది.వర్షంతో పాటు గాలి కూడా మొదలైంది. 4.30గంటల సమయంలో గాలివాన పెద్దదై భీభత్సం సృ ష్టించింది..ఓ వైపు వర్షం మరోవైపు తీవ్రంగా వీచిన గాలులతో జంగాలపల్లిలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినవరిమడుగులో రెండు ఇళ్లపై ఉన్న సిమెంట్‌తో నిర్మించిన నీటి ట్యాంకులు పగిలిపోయాయి.వర్షానికి ఉరుములు కూడా తోడు కావడంతో గ్రామంలోని పలు ఇళ్లల్లోని విద్యుత్ మీటర్లు కాలిపోయాయి.పలువురి రైతుల బత్తాయి తోటల్లో పక్వానికి వచ్చిన కాయలు చెట్లనుండి రాలి కింద పడి పోయాయి. జంగాలపల్లి, మారెళ్ల, మురుగుమ్మి, వరిమడుగు, వెంగళాయ పల్లిలో దుక్కి వర్షం కురిసింది. వరిమడుగు పొలాల్లో వర్షపునీరు ఏరులై పారింది. ఒక్కసారిగా గాలివాన విజృంభించడంతో పొలాల్లో ఉన్న రైతులు గ్రా మంలోకి పరుగులు తీశారు.
Updated Date - 2023-04-02T22:32:18+05:30 IST