ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గురువుల గలాటా

ABN, First Publish Date - 2023-09-21T23:25:39+05:30

విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు క్రమ శిక్షణ నేరాల్సిన గురువులే కట్టుతప్పారు. కొట్లాడకు దిగారు. పోలీసు స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి, కులం పేరుతో దూషించాడంటున్న ఎంఈవో నాయక్‌

ఎంఈవో, హెచ్‌ఎంల బాహాబాహీ

ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు

పెద్దదోర్నాల, సెప్టెంబరు 21: విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు క్రమ శిక్షణ నేరాల్సిన గురువులే కట్టుతప్పారు. కొట్లాడకు దిగారు. పోలీసు స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని చిన్నదోర్నాల పాఠశాలకు ఆగస్టు 11న ఎంఈవో మస్తాన్‌నాయక్‌ తనిఖీకి వెళ్లారు. అక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుధాకర్‌రెడ్డి సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో షోకాజ్‌ నోటీసుఇచ్చారు. అయినా నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తుండడంతో ఎంఈవో మస్తాన్‌ నాయక్‌ వేతనం నిలిపి వేశారు. ఈ క్రమంలో రామచంద్రకోట గ్రామం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనుల పరిశీలనకు బుధవారం ఎంఈవో వెళ్లారు. సుధాకర్‌రెడ్డి అక్కడికి చేరుకొనితన జీతం ఎందుకు నిలిపివేశారని ఎంఈవోతో వాదనకు దిగారు. దీంతో మాటామాటా పెరిగి ఇద్దరూ ఘర్షణకు దిగారు. అనంతరం సుధాకర్‌రెడ్డి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేరి చేతికి గాయమైందని చికిత్స పొందారు. అనంతరం మార్కాపురం పోలీసుస్టేషన్‌లో తనపై ఎంఈవో దాడి చేయడంతో కాలర్‌బోన్‌ విరిగిందని ఫిర్యాదు చేశారు.దీనిపై ఎంఈవో స్పందిస్తూ, పాఠశాలకు సక్రమంగా హాజరుకావాలని షోకాజ్‌ నోటీసులిచ్చామన్నారు. అయినా మార్పు రాకపోవడంతో నెల జీతం నిలిపి వేశామని చెప్పారు. దీంతో రామచంద్రకోటలో పాఠశాల పరిశీలనకు వెళ్లిన తన వద్దకు సుధాకర్‌రెడ్డి వచ్చి కులం పేరుతో దూషించడంతోపాటు దాడికి దిగారని తెలిపారు. ఈ విషమయైు తాను దోర్నాల పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏదిఏమైనా ఆదర్శంగా నిలవాల్సిన గురువులు కొట్లాటకు దిగడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-21T23:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising