ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుంటూరు చానల్‌ పొడిగింపునకు నిధులు మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2023-08-14T22:36:15+05:30

గుంటూరు చానల్‌ను ప ర్చూరు వరకు పొడిగించేందుకు నిధులు మంజూ రు చేయాలని నల్లమడ రైతుసంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సోమ వారం బాపట్లలో జరిగిన గ్రీవెన్‌ సెల్‌ కార్యక్రమా నికి నల్లమడ రైతుసంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ ఆధ్వర్యంలోని రైతులు తరలి వెళ్ళారు.

కలెక్టర్‌ కార్యాలయం వద్ద నల్లమడ రైతుసంఘం ప్రతినిధులు

గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం

అందజేసిన నల్లమడ రైతుసంఘం ప్రతిఽనిధులు

పర్చూరు, ఆగస్టు 14: గుంటూరు చానల్‌ను ప ర్చూరు వరకు పొడిగించేందుకు నిధులు మంజూ రు చేయాలని నల్లమడ రైతుసంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సోమ వారం బాపట్లలో జరిగిన గ్రీవెన్‌ సెల్‌ కార్యక్రమా నికి నల్లమడ రైతుసంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ ఆధ్వర్యంలోని రైతులు తరలి వెళ్ళారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు చా నల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తే 50 గ్రామాల ప్ర జలకు తాగునీటితోపాటు, వేల ఎకరాల భూముల కు సాగునీరు అందుతుందన్నారు. ప్రస్తుతం ఆ యా గ్రామాల ప్రజలు స్వచ్ఛమైన మంచినీరు లేక కలుషితమైన నీటి తోనే కాలం వెల్లబుచ్చుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. చేతికి అందివ చ్చిన పంటలు సైతం సకాలంలో సాగునీరు అందక రైతాంగం తీ వ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. గుంటూ రు చానల్‌ను పొడిగించాలని దశాబ్దాల కాలం నుం చి రైతుసంఘం అధ్వర్యంలో పోరాటం చేస్తున్నా నేటికి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా తయారైందన్నారు. ప్రస్తుతం నీటి కోసం ప్రజలు, రైతులు పడుతున్న అవస్థలను దృష్టిలో ఉంచుకొని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి తక్షణమే గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు కావాల్సిన నిధులను మం జూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమం లో రైతుసంఘం నాయకులు కోటా హరిప్రసాద్‌, ఒగ్గిశెట్టి నరసింహం, గడ్డిపాటి శ్రీనివాసరావు, షేక్‌ కాలేషావలి, తులసి చంద్రయ్య, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.

భూ బాధితులను ఆదుకోవాలి

జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి పర్చూరు ప్రాంతంలో భూములను కోల్పోతున్న బాధిత రై తులకు నాణ్యమైన పరిహారం అం దజేసి ఆదుకోవాని పర్చూరు గ్రామా నికి చెందిన కఠారి రమేష్‌ నాయు డు కోరారు. ఇందుకుసంబంధించి క లెక్టర్‌కు రైతుల తరుపున వినతిపత్రం అందజేశా రు. ప్రభుత్వం పరిహారం విషయంలో జూన్‌ 1, 2020 సంవత్సరం కాలంలో ఉన్న రిజిస్ర్టేషన్‌ వ్యా ల్యూని పరిగణలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తామ ని చెప్పటం సరికాదన్నారు. ప్రభుత్వం జూన్‌ 1, 2022లో ప్రకటించిన రిజిస్టేషన్‌ వ్యాల్యూ ప్రకారం పరిహారం చెల్లించి భూములను కోల్పోతున్న రైతు లను ఆదుకోవాలన్నారు. జాతీయ రహదారి విష యంలో అధిక శాతం భూములను కోల్పోయే వారి లో సన్న, చిన్న కారు రైతులే ఉన్నారన్నారు. కార్యక్ర మంలో తంగెళ, మల్లికార్జునరావు, తదితరులు పా ల్గొన్నారు.

Updated Date - 2023-08-14T22:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising