వెంచర్ల కోసం ఒడా నిధులు..!
ABN, First Publish Date - 2023-10-01T00:27:05+05:30
ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్డుకు ఒంగోలు అర్బన్ డవల్‌పమెంట్ (ఓడా) అడ్డుగా గేటు పెడుతోంది. ఆ సమీపంలో ఉన్న వెంచర్ల కోసమే ఇదంతా అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ప్రతి రూపాయి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అందులో భాగంగానే స్థానిక ఒకటవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఉత్తరం వైపు తారురోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు మార్గం అటు బైపాస్ నుంచి ఇటు నగరంలోకి ఎంతో సౌకర్యవంతంగా ఉంది.
చెత్త నియంత్రణ పేరుతో ప్రజా ధనం వృధా
ఒంగోలు (కార్పొరేషన్), సెప్టెంబరు 30: ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్డుకు ఒంగోలు అర్బన్ డవల్‌పమెంట్ (ఓడా) అడ్డుగా గేటు పెడుతోంది. ఆ సమీపంలో ఉన్న వెంచర్ల కోసమే ఇదంతా అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ప్రతి రూపాయి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అందులో భాగంగానే స్థానిక ఒకటవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఉత్తరం వైపు తారురోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు మార్గం అటు బైపాస్ నుంచి ఇటు నగరంలోకి ఎంతో సౌకర్యవంతంగా ఉంది. గత కొన్నేళ్ళుగా ఈ రోడ్డు అందరికీ వెసులుబాటు ఉండగా, ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో పదులసంఖ్యలో అపార్ట్‌మెంట్లు, వెంచర్లు వెలిశాయి. దీంతో అటు రాజీవ్‌నగర్ వైపు వెంచర్ల వద్దకు వీలు లేకపోవడంతో అధికార పలుకుబడితో ఏకంగా ప్రజల కోసం నిర్మించిన రోడ్డుకు గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఓడా నిధులు కేటాయించడం గమనార్హం. ఈ గేటు ఏర్పాటు ద్వారా ఇకపై ఆ రోడ్డులో రాకపోకలు సాగించలేదు. కాపలాగా కార్పొరేషన్‌కు చెందిన ఒక ఉద్యోగిని నియమించనున్నట్లు సమాచారం. దీనిని పలువురు నగరవాసులు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఎస్‌ఎస్ ట్యాంకుపై వాకింగ్ చేసేవారికి ఈ మార్గం ఎంతో వీలుగా ఉండగా ఇకపై దీనిని మూసివేయడాన్ని వాకర్లు తప్పుబడుతున్నారు. ఎవరి ప్రయోజనం కోసం ఈ గేటు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కార్పొరేషన్ అధికారులను వివరణ కోరగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోడ్డు పక్కన చెత్తాచెదారం, వ్యర్థాలు వేస్తున్నారని, వాటిని నియంత్రించేందుకు గేటు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఊరి చివరన గతంలో ఎవరూ కూడా పోయని ప్రాంతంలో చెత్త పేరుతో గేటు పెట్టి ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తున్న కార్పొరేషన్ అధికారులు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం వేలమంది రాకపోకలు సాగించే ప్రాంతం, గతంలోనే పార్కు కోసం కేటాయించిన ఊరచెరువులో కొన్ని నెలలుగా కార్పొరేషన్‌కు చెందిన చెత్త సేకరణ ఆటోలు చెత్త పోస్తుంటే ఇక్కడ నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎలాంటి సమస్య లేకపోయినా, చెత్తపేరుతో లక్షల ఒడా నిధులు కేటాయించి, గేటు ఏర్పాటు చేసి, రాకపోకలు మూసివేడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా గేటు తొలగించాలని వారు కోరుతున్నారు.
Updated Date - 2023-10-01T00:27:05+05:30 IST