ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిజిగాడిగూడు

ABN, First Publish Date - 2023-03-05T22:47:48+05:30

దర్శి, కనిగిరి మేజర్‌ పంచాయతీల స్థాయి నుంచి నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ పొందినా సమస్యలు మాత్రమే అలానే ఉన్నాయి. అభివృద్ధి విషయం అటుంచితే.. ట్రాఫిక్‌ సమస్య మాత్రం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ప్రతినిత్యం చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిఽధ అవసరాల నిమిత్తం ఆ రెండు పట్టణాలకు ప్రజలు వచ్చిపోతుంటారు. ట్రాఫిక్‌ సమస్య సమూల పరిష్కారానికి సంబంధించి అటు నగర పంచాయతీ అధికారులుగానీ, ఇటు పోలీసులుగానీ ప్రత్యేకించి చర్యలు తీసుకున్న పాపానపోలేదు. ఏదో అప్పుడప్పుడు మొక్కుబడి చర్యలతో మమఅనిపిస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఇప్పటికైనా పాలకులు ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దర్శిలో అడ్డగోలుగా వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కనిగిరి, దర్శి నగర పంచాయతీల్లో నిత్యం ట్రాఫిక్‌ సమస్య

పట్టించుకోని అధికారులు

దర్శి, కనిగిరి మేజర్‌ పంచాయతీల స్థాయి నుంచి నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ పొందినా సమస్యలు మాత్రమే అలానే ఉన్నాయి. అభివృద్ధి విషయం అటుంచితే.. ట్రాఫిక్‌ సమస్య మాత్రం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ప్రతినిత్యం చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిఽధ అవసరాల నిమిత్తం ఆ రెండు పట్టణాలకు ప్రజలు వచ్చిపోతుంటారు. ట్రాఫిక్‌ సమస్య సమూల పరిష్కారానికి సంబంధించి అటు నగర పంచాయతీ అధికారులుగానీ, ఇటు పోలీసులుగానీ ప్రత్యేకించి చర్యలు తీసుకున్న పాపానపోలేదు. ఏదో అప్పుడప్పుడు మొక్కుబడి చర్యలతో మమఅనిపిస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఇప్పటికైనా పాలకులు ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దర్శి నగర పంచాయతీలో రోజురోజుకూ పెరుగుతున్న సమస్య

పార్కింగ్‌ స్థలం లేక రోడ్లపైనే వాహనాల నిలిపివేత

దర్శి, మార్చి 5 : నగర పంచాయతీ పరిధిలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. నియంత్రణ కొరవడడంతో వాహనాలను అడ్డగోలుగా నిలుపుతున్నారు. రోడ్డు మార్జిన్‌లో వాహనాలను పూర్తిగా అడ్డుగా పెడుతుండడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. గడియార స్తంభం వద్ద గతంలో ట్రాఫిక్‌ నియంత్రణకు సిగ్నల్‌ లైట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేవారు. ప్రస్తుతం సిగ్నల్స్‌ పనిచేయడం లేదు. దీంతో వాహనదారులు ఇష్టానుసారంగా వెళ్తుండడంతో సమస్య ఏర్పడుతోంది. ప్రధాన రహదారులైన దర్శి - పొదిలి, దర్శి - కురిచేడు రోడ్డు, దర్శి - అద్దంకి రోడ్డు, దర్శి - లంకోజనపల్లి రోడ్ల మార్జిన్‌లో ఇరువైపులా ద్విచక్ర వాహనాలను, ఆటోలను అడ్డగోలుగా నిలుపుతున్నారు. వాహనాలు ఎదురుపడితే తొలిగేందుకు నానాఇబ్బందులు పడాల్సివస్తోంది.

పార్కింగ్‌ స్థలం లేక ఇక్కట్లు

పట్టణంలో ఎక్కడా పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించకపోవడంతో వాహనాలను రోడ్డుమార్జిన్లలో పె డుతున్నారు. చుట్టుపక్కల గ్రామీ ణ ప్రాంతాల వారు వివిధ పను ల నిమిత్తం దర్శికి నిత్యం వస్తుంటారు. వారు వివిధ రోడ్లలో మా ర్జిన్ల ముందే తమ వాహనాలను పార్కింగ్‌ చేస్తారు. ఆ ఆవాహనాల పక్కనే ఆటోలనూ నిలుపుతుండడంతో రోడ్డుపై నడిచివెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.

కనిగిరిలో మార్జిన్ల మాయంతో మరింతగా సమస్య

పామూరు బస్టాండ్‌లో ఇబ్బందులు

పెరుగుతున్న రోడ్డు ఆక్రమణలు

కుచించుకుపోతున్న బొడ్డుచావిడి సెంటర్‌

కనిగిరి, మార్చి 5 : కనిగిరి నగర పంచాయతీ పరిధిలో ప్రధాన రోడ్లన్నీ ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. బొడ్డుచావిడి సెంటర్‌, నగరికంటి బసవయ్య సెంటర్‌, తీగలగొంది, చర్చి సెంటర్‌లలో నిత్యం ట్రాఫిక్‌ నిలిచిపోతుండడంతో పాదచారులు, వాహనదారులు నానాఇబ్బందులు పడుతున్నారు. నగరపంచాయతీ పాలకవర్గం ఏర్పడి మూడేళ్లవుతున్నా అభివృద్ధి జరగకపోగా, ఆక్రమణలు పెరిగి నిత్యం ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు ఎదురవుతున్నాయి. గతేడాది కలెక్టర్‌ వచ్చినప్పుడు పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో రోడ్డు ఆక్రమణలు చూసి అసహనం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించాలని పోలీసులను, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అయినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, కూరగాయల దుకాణదారులు, పూల దుకాణాలు ఏకంగా ఫుట్‌పాత్‌, ఆపై మార్జిన్‌దాటి రోడ్డుపైకి వచ్చి మరీ వ్యాపారాలు చేస్తున్నారు. చర్చి సెంటర్‌లో వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోతున్నాయి. అదేవిధంగా పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో బస్సు కోసం వేచి ఉండాలంటే ప్రయాణికులు, పాదచారులు నడిరోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకో పక్క కోర్డు ఎదుట కుండల దుకాణాదారులు ఏకంగా రోడ్డుపైకి వచ్చేశారు.

ఆక్రమణలో బొడ్డుచావిడి

బొడ్డుచావిడీ సెంటర్‌ను కూరగాయల వ్యాపారులు ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలో ఎంతో విశాలంగా ఉన్న బొడ్డుచావిడి వీధి ప్రస్తుతం ఆక్రమణ చెరలో చిక్కుకుంది. మున్సిపల్‌ కార్యాలయం నుంచి బొడ్డుచావిడి వరకు రోడ్డు విస్తరణ జరిగింది. అక్కడ నుంచి నగరికంటి బసవయ్య సెంటర్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించకపోవడంతో ఆ రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-03-05T22:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising