ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభం

ABN, First Publish Date - 2023-06-03T01:30:47+05:30

అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో శ్రీ నెమిలిగుండ్ల రంగనాయకస్వామి ముఖద్వార ప్రారంభోత్సవం, శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంభం, జూన్‌ 2 : అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో శ్రీ నెమిలిగుండ్ల రంగనాయకస్వామి ముఖద్వార ప్రారంభోత్సవం, శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ముగిసిన అంకాళమ్మ తిరునాళ్ల

కొండాపురం : మండలంలోని గొట్టిగుండాలలో నాలుగురోజులుగా జరుగుతున్న కోట అంకాళమ్మ తిరునాళ్ల గురువారం ముగిసింది. చివరిరోజు అమ్మవారిని గ్రామంలో ఊరేగించి, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకాశం ఎడ్లకు నాలుగవ బహుమతి

తిరునాళ్ల సందర్భంగా బండలాగుడు పోటీలు నిర్వహించగా, పలు ప్రాంతాల నుంచి నాలుగు జతల ఎద్దులు పాల్గొన్నాయి. కడప జిల్లా చెందిన శీలం జగన్మోహనరెడ్డి ఎడ్లు ప్రఽథమ బహుమతి రూ.60 వేలు, కడప జిల్లాకు చెందిన లక్కు నాగశివశంకర్‌ ఎడ్లు ద్వితీయ బహుమతి రూ.40 వేలు, ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మక్కెన కోటేశ్వరరావు ఎడ్లు మూడవ బహుమతిగా రూ 20 వేలు, కడప జిల్లాకు చెందిన కామిని వెంకటసాయి. ప్రతాపరెడ్డిల ఎడ్లు నాల్గవ బహుమతిగా రూ.10 వేలను అందుకున్నాయి.

5న అక్కపల్లెలో...

బేస్తవారపేట : శ్రీ భూ లక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఈ నెల 6న రాష్ట్ర స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించ నున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 5న రెండుపళ్ల విభాగంలో పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ పోటీల్లో మొదటి మూడు బహు మతులు వరసగా, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. 6న ఉదయం నిర్వహించే పోటీలలో ప్రథమ బహుమతి రూ.50వేలు, రెండవ బహుమతి రూ.30వేలు, మూడవ బహుమతి రూ.20వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు, ఐదో బహుమతి రూ.5 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9849490257, 9133262194, 9959815290లో సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2023-06-03T01:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising