ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిథిల భవనాన్ని కూల్చరా..?

ABN, First Publish Date - 2023-01-10T23:04:32+05:30

మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శిథిలమైన ఎమ్మార్సీ భవనం ఏళ్ల తరబడి అలాగే ఉంది. పైకప్పు దె బ్బతిని పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి. గోడలు నెర్రలిచ్చాయి.

శిథిలావస్థలో ఎమ్మార్సీ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొంచివున్న ప్రమాదంపై ప్రజల ఆందోళన

దర్శి, జనవరి 10 : మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శిథిలమైన ఎమ్మార్సీ భవనం ఏళ్ల తరబడి అలాగే ఉంది. పైకప్పు దె బ్బతిని పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి. గోడలు నెర్రలిచ్చాయి. ఏ నిమిషంలోనైనా కూలే పరిస్థితి ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఎ నిమిదేళ్ల క్రితం అక్కడి నుంచి శిక్షణ కేంద్రం భవనంలోకి మారారు. అ ప్పటి నుంచి శిథిలమైన భవనం అలాగే ఉంచారు. అదే ప్రాంతంలో ఎంపీడీవో, వ్యవసాయ, గృహ నిర్మాణ, విద్యాశాఖ కార్యాలయాలతో పాటు భవిత విద్యా కేంద్రం ఉన్నాయి. నిత్యం ప్రజలు తిరుగుతూ ఉం టారు. ఆ భవనం కూలితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉం ది. భవనానికి నిర్మించిన తులపులు, కిటికీలు ఇతర సామగ్రి చెద లుపట్టి పోటుతున్నాయి. భవనాన్ని కూల్చేందుకు ఉన్నతాధికారుల అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపారు. అయినప్పటికీ ఈ విషయం గూర్చి అధికారులు పట్టించుకోడం లేదు. ఏ నిమిషంలో నైనా కూలిపోయే భవనాన్ని తొలగించకుండా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-01-10T23:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising