ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దీక్షాగ్రహం

ABN, First Publish Date - 2023-09-22T23:33:35+05:30

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి జైలులో ఉంచడం అన్యాయమంటూ అన్ని వర్గాలు గళమెత్తుతున్నాయి. ఆయనకు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు పది రోజులుగా కొనసాగుతుండగా, వివిధ వర్గాలు, భిన్న రంగాల వారు పాల్గొంటున్నారు. ఇతర రూపాల్లోనూ రాత్రి, పగలు తేడా లేకుండా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతాలో నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కీలక నేతలు కార్యక్రమాలను కొనసాగుతుండగా మహిళలు, దళితులు, రైతులు, వృత్తి సంఘాల ప్రతినిధులు దీక్షల్లో పాల్గొంటున్నారు.

ఒంగోలు దీక్షలో మాట్లాడుతున్న జనార్దన్‌, పక్కన బాలాజీ

బాబుకు మద్దతుగా అన్ని వర్గాలు జిల్లావ్యాప్తంగా దీక్షలు,

ఇతర రూపాలలోనూ సంఘీభావం

తాజా పరిణామాల నేపథ్యంలో నిరసనలు కొనసాగింపు

కొండపి సెగ్మెంట్‌లో దేవాలయాలలో పూజలు

ఒంగోలు, సెప్టెంబరు 22 (ఆంఽఽధ్రజ్యోతి): టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి జైలులో ఉంచడం అన్యాయమంటూ అన్ని వర్గాలు గళమెత్తుతున్నాయి. ఆయనకు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు పది రోజులుగా కొనసాగుతుండగా, వివిధ వర్గాలు, భిన్న రంగాల వారు పాల్గొంటున్నారు. ఇతర రూపాల్లోనూ రాత్రి, పగలు తేడా లేకుండా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతాలో నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కీలక నేతలు కార్యక్రమాలను కొనసాగుతుండగా మహిళలు, దళితులు, రైతులు, వృత్తి సంఘాల ప్రతినిధులు దీక్షల్లో పాల్గొంటున్నారు. అలాగే శుక్రవారం కూడా జిల్లా అంతటా చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అనుబంధ రైతు, బీసీ కమిటీల నాయకులు రిలే దీక్షలు చేపట్టగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దా మచర్ల జనార్దన్‌, ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బా లాజీలు పా ల్గొన్నారు. చీ మకుర్తిలో జరిగిన దీక్షల్లో టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఎస్‌టీసెల్‌ కమిటీ ప్రతినిధులు పాల్గొనగా, కనిగిరిలో టీడీపీ ఎస్టీసెల్‌ ప్రతినిధులు చేపట్టిన దీక్షల్లో అక్కడి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. మార్కాపురంలో జరిగిన దీక్షలో టీడీపీ పొదిలి మండల నాయకులు పాల్గొనగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఎర్రగొండపాలెంలో పట్టణ టీడీపీ నాయకులు దీక్షలు నిర్వహించగా నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు. దర్శిలో పట్టణ టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు దీక్షలలో పాల్గొనగా గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి నేతృత్వంలో దీక్షలు సాగాయి. కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. అదే సమయంలో నియోజకవర్గంలోని పలుచోట్ల పార్టీశ్రేణులు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. వల్లూరమ్మ దేవాలయంలో సీనియర్‌ నేత దామచర్ల పూర్ణచంద్రరావు నేతృత్వంలో పూజలు నిర్వహించగా కొండపిలోని ప్రసన్నాంజేయ స్వామి ఆలయంలో మండల టీడీపీ నేతలు పూజలు చేశారు. ఇతర పలుచోట్ల ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాయి. ఇదిలా ఉండగా న్యాయస్థానంలో చంద్రబాబు క్వాష్‌ ఫిటిషన్‌ కొట్టివేయడం, సీఐడీ కస్టడికి రెండు రోజులు ఏసీబీ కోర్టు అనుమతులు ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో జిల్లాలో చంద్రబాబుకు సంఘీభావ కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

Updated Date - 2023-09-22T23:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising