ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంభం చెరువుకట్టపై పర్యాటకుల సందడి

ABN, First Publish Date - 2023-01-02T01:06:12+05:30

ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువు కట్టపై నూతన సంవత్సరం వేళ సందడి నెలకొంది. సందర్శకులతో కళకళలాడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంభం, జనవరి 1 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువు కట్టపై నూతన సంవత్సరం వేళ సందడి నెలకొంది. సందర్శకులతో కళకళలాడింది. 2021లో కురిసిన వర్షాలకు కంభం చెరువుకు 21 అడుగులమేర నీరు చేరడమేకాక నెలరోజుల పాటు అలుగుపారిన విషయం విధితమే. ఇప్పటివరకు కంభం చెరువు పూర్తిగా 11సార్లు మాత్రమే నిండింది. ప్రస్తుతం చెరువులో 16 అడుగులమేర నీరు ఉంది. సెలవు రోజుల్లో కంభం చెరువు అందాలు తిలకించేందుకు పర్యాటకులు భారీగానే తరలి వస్తున్నారు. నూతన సంవత్సరం ప్రారంభం ఆదివారం రావడంతో చెరువుకట్టపై సందడి నెలకొంది. అయితే పర్యాటకులకు చెరువుకట్టపై సరైన సదుపాయాలు లేవు. ఇరిగేషన్‌ అధికారులు గాని, పంచాయతీ అధికారులు అక్కడి పారిశుధ్యంపై దృష్టి సారించలేదు. పర్యాటకులు తినిపడవేసిన వ్యర్థాలు, విస్తరాకులు, ఇతర చెత్తతో పేరుకుపోయి ఇబ్బందికరంగా మారింది. చెత ్తతొట్లు నిండిపోయి వాటిని శుభ్రం చేసేవారు లేక కంపుకొడుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - 2023-01-02T01:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising