ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కజొన్న రైతు కుదేలు

ABN, First Publish Date - 2023-03-25T23:18:29+05:30

రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగుచేసిన రైతులు కుదేలయ్యారు. గత ఏడాది మంచి లాభాలను తెచ్చి పెట్టటంతో రైతులు ఈ ఏడాది అధిక మెత్తంలో భూములను కౌలుకి తీసుకొని సాగుచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అకాలవర్షానికి దెబ్బతిన్న పంట

నష్టాలు తప్పవని ఆందోళన

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

బల్లికురవ, మార్చి 25: రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగుచేసిన రైతులు కుదేలయ్యారు. గత ఏడాది మంచి లాభాలను తెచ్చి పెట్టటంతో రైతులు ఈ ఏడాది అధిక మెత్తంలో భూములను కౌలుకి తీసుకొని సాగుచేశారు. మొదట్లో పంట ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది కూడా పంట బాగా వస్తుందని ఎంతో ఆశపడ్డారు. అయితే, రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో మొక్కజన్న పంట దాదాపు 80 శాతం మేర నేలవాలింది. లేత దశలో కండె పోసుకొనే సమయంలో ఒక్కసారిగా మొక్కలు మొత్తం పడిపోయాయి. దీంతో తమకు తీవ్ర నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. అంబడిపూడి, గుంటుపల్లి, కొమ్మినేనివారిపాలెం, కొణిదెన గ్రామాలలో ఎక్కవ మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అంబడిపూడి గ్రామానికి చెందిన దద్దాల అంజయ్య అనే రైతు అయిదు ఎకరాలలో మొక్కజొన్న పంట వేయగా గాలుల ప్రభావంతో పంట మెత్తం నేలవారింది. పంట ఎందుకు పనికి రాకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

పంట దెబ్బతిన్న రైతుల వివరాలు నమోదుచేయాలి

బల్లికురవ, మార్చి 25: రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేయాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియో జకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని కొమ్మినేనివారిపాలెం, అంబడిపూడి గ్రామాలలో వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను కృష్ణచైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అకాల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళతానని చెప్పారు. రైతులకు పంట నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఈసందర్భంగా పలువురు రైతులు కండె పోసుకొనే దశలో మొక్కజొన్న పడిపోయిందని, ఒక్క విత్తనం కూడా చేతికి రాదని తెలిపారు. అలాగే, పలు గ్రామాలలో ఆరటి, మునగ, మిర్చి పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఏవో కుమారి, ఉద్యానశాఖ అధికారి హన్మంతునాయక్‌, వైసీపీ నేతలు చింతల శ్రీనివాసరావు, పెద్దన్న, శ్రీనువలి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising