ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పసిపాప మృతిపై వివాదం

ABN, First Publish Date - 2023-09-22T02:07:10+05:30

గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవ సమయంలో నవజాత శిశువు మృతిచెందింది.

గిద్దలూరు, సెప్టెంబరు 21 : గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవ సమయంలో నవజాత శిశువు మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆ పాప కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అంబ వరం గ్రామానికి చెందిన షేక్‌ హసీనా పురిటినొప్పులతో రెండు రోజులక్రితం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయింది. స్కానింగ్‌, ఇతర పరీక్షలు నిర్వహించగా కొద్దిగా బరువు తక్కువ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తగిన మందులు వాడి గురువారం సిజీరి య న్‌ ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే శ్వాస తీసుకోవడం లేదని గుర్తించి ఆక్సిజన్‌ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మునీరు తాగడం వలన శ్వాస తీసుకోలేక బిడ్డ మృతిచెందిందని వైద్యులు పేర్కొన్నారు. అయితే పాప బంధువులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్నారు. రాత్రి వరకు కూడా బిడ్డ గుండె బాగా కొట్టుకొందన్నారు. ఇబ్బంది లేదని చెప్పి ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చి పాప మృతిచెందిందని చెప్పార న్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, పాప బంధువులు ఆసుపత్రిలో నేలపై బైఠాయించి వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంగా ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ సూరిబాబును వివరణ కోరగా ఇందులో సిబ్బంది పొరపాటు ఏమీలేదని పేర్కొన్నారు. ఉమ్మనీరు తాగడం వల్లె ఇలా జరిగిందన్నారు. స్థానిక సీఐ దేవప్రభాకర్‌, ఎస్సై మహేష్‌, వైద్యులు ఆందోళన చేస్తున్న బంధువులకు జరిగిన ఘటనకు వివరించడంతో వారు సద్దుమణిగారు. చిన్నారి తల్లి హసీనా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హసీనాకు మొదటి కాన్పులో బాలుడు ఉండగా రెండవ కాన్పులో అమ్మాయి ప్రస్తుతం మృతిచెందింది.

Updated Date - 2023-09-22T02:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising