ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండెక్కిన కోడి ధర

ABN, First Publish Date - 2023-06-12T00:08:12+05:30

కోడి మాంసం ధర కొండెక్కింది. ఈ ఏడాది తొలిసారిగా కిలో రూ.300కు చేరుకుంది. వారం వ్యవధిలో కిలోకు రూ.50 మేర పెరిగింది. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కోళ్ల పెంపకం గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు రోజుల తరబడి వడగాడ్పులు వీస్తుండడంతో కోళ్లు చనిపోతున్నాయి. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడం కూడా సమస్యగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండల తీవ్రతతో

ఇంకా పెరిగే అవకాశం

ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 11 : కోడి మాంసం ధర కొండెక్కింది. ఈ ఏడాది తొలిసారిగా కిలో రూ.300కు చేరుకుంది. వారం వ్యవధిలో కిలోకు రూ.50 మేర పెరిగింది. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కోళ్ల పెంపకం గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు రోజుల తరబడి వడగాడ్పులు వీస్తుండడంతో కోళ్లు చనిపోతున్నాయి. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడం కూడా సమస్యగా మారింది. దీనికితోడు ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్‌ ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు స్థానికంగా కోళ్ల పెంపకాన్ని బాగా తగ్గించారు. కొంత మంది పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కోళ్లను తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నింటి కారణంగా చికెన్‌ ధరలు పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్‌ రూ.250 వరకు ఉండగా ఈ వారం రూ.300కు చేరుకుంది. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు. మరో వైపు కోడిగుడ్ల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. అట్ట (30) గుడ్లు గత వారం వరకు రూ.165 వరకు ఉండగా ఆదివారం రూ.175కు చేరింది. ఎండల తీవ్రతతో కోడిగుడ్ల సరఫరా కూడా సగానికి సగం పడిపోవడం వీటి ధరల పెరుగుదలకు కారణమైంది.

Updated Date - 2023-06-12T00:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising