ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపిన చంద్రబాబు పర్యటన

ABN, First Publish Date - 2023-04-23T01:55:42+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20 మార్కాపురం లో పర్యటించడం, ఆయన జన్మదిన వేడుకలు వెనుకబడిన పశ్చిమ ప్రాంతంగా చిన్నారులు, మహిళల మధ్య చేసుకోవడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, ఏప్రిల్‌ 22: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20 మార్కాపురం లో పర్యటించడం, ఆయన జన్మదిన వేడుకలు వెనుకబడిన పశ్చిమ ప్రాంతంగా చిన్నారులు, మహిళల మధ్య చేసుకోవడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాలలో గురువారం జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి, దానికి ముందు నిర్వహించిన రోడ్‌షోకు టీడీపీ అధిష్ఠానం ఆశించిన స్థాయి కంటే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడం వారిని విస్మయానికి గురి చేసింది. చంద్రబాబునాయుడు ప్రసంగంలో సైతం ఈ విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు. ‘మార్కాపురంలో నా జన్మదిన వేడుకలకు ఇంతమంది హాజరుకావడం నా అదృష్టంగా భావిస్తున్నా, నా జీవితంలో నా 73వ పుట్టినరోజు వేడుకలు మర్చిపోలేనివి’ అని మాటలను చంద్రబాబు నాలుగైదు పర్యాయాలు చెప్పారు. చంద్రబాబునాయుడు పాల్గొంటున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలకు సంబంధించి పార్టీ ప్రత్యేక నిఘా విభాగం ఎప్పటికప్పుడు నివేదిక లను తయారు చేస్తుంది. ఇప్పటి వరకూ చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించి ఎక్కువ మంది హాజరైన వాటిలో మార్కాపురం, ఎమ్మిగనూరు సమావేశాలు ప్రథ మ, ద్వితీయ స్థానాలలో నిలిచాయి. మార్కాపురం లో చంద్రబాబునాయుడు పర్యటన ఖరారు కాక ముందు నుంచే మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్‌ సాధన, మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశాలపై 20 రోజుల పాటు ప్రజా చైతన్య పాదయాత్ర చే శారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ఘన విజయం, కందుల పాదయాత్రలు ఇప్పటి వరకూ డోలా యమానంలో ఉన్న పార్టీ ద్వితీ య శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఉత్తేజా న్నిచ్చాయి. పార్టీ శ్రేణులను టీడీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌లు క్రియాశీలక పాత్ర పోషించారు.

విజయోత్సవ సంబరాలు

మాజీముఖ్యమంత్రి, టీడీపీ జాతాయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం కావడంతో టీడీపీ నేతలు విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శనివారం పార్టీ కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంతో టీడీపీ శ్రేణులు పనిచేసి టీడీపీ అధికారంలోకి వచ్చేం దుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాల న్నారు.

Updated Date - 2023-04-23T01:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising