ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీకటి జీవో ప్రతుల దహనం

ABN, First Publish Date - 2023-01-15T01:44:49+05:30

ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ఉన్న జీవో నంబరు-1 (చీకటి జీవో) ప్రతులను టీడీపీ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి శనివారం దహనం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, జనవరి 14: ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ఉన్న జీవో నంబరు-1 (చీకటి జీవో) ప్రతులను టీడీపీ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి శనివారం దహనం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద శనివారం భోగి పండుగ సందర్భంగా మంటలు వేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ... సైకో ప్రభుత్వం పోయి సైకిల్‌ ప్రభుత్వం రావాలన్నారు ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 ప్రతులను భోగి మంటలలో వేసి దహనం చేశారు. వైసీపీ దుష్టపరిపాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలీ, టీడీపీ నాయకులు అల్లంపల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : రాష్ట్ర ఽప్రభుత్వం తెచ్చిన జీవో నంబరు 1 ప్రతులను టీడీపీ మండల నాయకులు శనివారం దహనం చేశారు. ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ప్రజావ్యతిరేక జీవోను ప్రభుత్వం తెచ్చిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎం.వలరాజు, మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డి, నాయకులు డి.చలమయ్య, ఎం.అల్లూరిరెడ్డి, వి.ఆంజనేయులు, కె.ఏడుకొండలు, ఆవులయ్య, రాయుడు, అంజిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పి.వెంకటేశ్వర్లు, బాలనాసర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : చీకటి జీవోలను తెచ్చి రాష్ట్రంలో టీడీపీ సభలను, పాదయాత్రలను అడ్డుకోవాలను కోవడం వైసీపీ నాయకుల అవివేకం అని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జీవో నంబరు 1 ప్రతులను శనివారం బోగిమంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సభలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక జీవో నంబరు 1 పేరుతో అడ్డంకులు కల్పిస్తున్నార న్నారు. ఎర్రగొండపాలెంలో ఎన్‌టీఆర్‌ కూడలి నుంచి ఉదయం 5.30 గంటలకే అంబేడ్కర్‌ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అక్కడ బోగి మంటలు వేసి జీవో ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కామేపల్లి వెంకటేశ్వర్లు, శనగా నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, టీడీపీ ముఖ్య నాయకులు తోట మషేష్‌, కంచర్ల సత్యనారాయణగౌడ్‌, ఎం.మంత్రునాయక్‌, అడుమల్లి రామచంద్రరావు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, మైనార్టీ నాయకులు షేక్‌ మాబు, ఇస్మాయిల్‌, మస్తాన్‌వలి, ఎస్సీసెల్‌ నాయకులు కోటా డేవిడ్‌, చేదూరి కిశోర్‌, మహిళా అధ్యక్షురాలు ఎం.రమణమ్మ, టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చీకటి జీవోలు సరికాదు - సీఐటీయూ

పొదిలి రూరల్‌ : వైసీపీ ఇష్ట్రారాజ్యంగా చీకటి జీవోలు తెస్తోందని ఆ జీవోను అందరు ముక్తకంఠంతో వ్యతిరే కించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ అన్నారు. శనివారం ఆ జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామ న్నారు. విభజన చట్టంలో ఉన్న వాటి గురించి కేంద్రాన్ని నిలదీయకుండా కొత్తగా సొంతంగా జీవోలు తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్ర మంలో సీపీఎం, జేవీవీ, నాయకులు పంచాయతీ కార్మికులు జి నాగులు, డి సుబ్బయ్య, వెంకటనరస య్య, శేషయ్య, ప్రసాద్‌, వెంకటయ్య, నరసయ్యలు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : రహదారులపై సభలు, సమావేశాలను రద్దు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1 రద్దు చేయాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో జీఓ కాపీని భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బ్రిటీష్‌ కాలంనాటి చట్టాలను అమలుజేయడం తగదన్నారు. కార్యక్రమంలో డి.సోమయ్య, సుబ్బరాయుడు, ఇమాం సా, హరి, తిరుమలయ్య, రషీద్‌ పాల్గొన్నారు.

సైకో పోవాలి....సైకిల్‌ రావాలి

పుల్లలచెరువు : వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం లో చీకటి పాలన సాగుతుందని సైకో పాలన పోవా లి...సైకిల్‌ పాలన రావాలని టీడీపీ మండలాధ్యక్షడు పయ్యావుల ప్రసాద్‌ అన్నారు. శనివారం బోగి సందర్భంగా టీడీపీ రాష్ట్ర పిలుపు మేరకు జీవో నంబరు 1 ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యా వుల ప్రసాద్‌,టీడీపీ నాయకులు గజ్వేల్లి బాస్కర్‌, మేడికొండ లక్ష్మినారాయణ, మాజీ సర్పంచి క్రిష్ణయ్య, మాజీ ఎంపీటీసీ ఈదెమ్మనాయుడు, టౌన్‌ అధ్య క్షుడు లాలయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దళితులను మోసం చేసిన మంత్రి సురేష్‌

టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు : జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సురేష్‌ దళితులను మోసం చేశాడని టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని దేవరాజు గట్టులో టీడీపీ కార్యాలయం వద్ద శనివారం భోగి మంటలు వేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు-1 ప్రతులను మంటలలో వేసి తగులపెట్టారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లా డుతూ దళిత సామాజికవర్గానికి చెందిన మంత్రి సురేష్‌ కందుకూరు ఘటనలో నలుగురు దళితులు మృతిచెందితే వారి కుటుంబాన్ని పరామర్శించక పోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబునాయుడు చేస్తున్న రోడ్‌ షోలు, బహిరంగ సభలకు ప్రజలు ఎక్కువగా తరలిరావడం చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు చీకటి జీవోలను తీసుకువస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. 2024లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి కార్యకర్త ఇప్పటినుంచే నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, గుమ్మా గంగరాజు, దండా వెంకటేశ్వరరెడ్డి, ఇండ్లా రామకృష్ణారెడ్డి, జెడ్డా రవి, తిరుమలరెడ్డి వెంకటరెడ్డి, నక్కా శ్రీను, తోకల ఎల్లయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T01:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising