ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్ట్‌లు అమానుషం

ABN, First Publish Date - 2023-09-25T23:11:16+05:30

మహిళలు అనే విచక్షణ కూడా చూడకుండా అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించటం సిగ్గు చేటని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో రైల్వే స్టేషన్‌ నుంచి వస్తున్న వందలాది మందిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లు, కల్యాణ మండపాల్లో నిర్బంధించటం అప్రజాసామిక చర్య అని అన్నారు.

గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి ఎమ్మెల్యే

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి, సెప్టెంబరు 25: మహిళలు అనే విచక్షణ కూడా చూడకుండా అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించటం సిగ్గు చేటని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో రైల్వే స్టేషన్‌ నుంచి వస్తున్న వందలాది మందిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లు, కల్యాణ మండపాల్లో నిర్బంధించటం అప్రజాసామిక చర్య అని అన్నారు. అంగన్‌ వాడీ కార్యకర్తల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయటానికి వెళ్తుండగా ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేయటాన్ని తీ వ్రంగా ఖండించారు. జగన్‌ పాదయాత్రలో వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి మడిమ తిప్పారన్నారు. ధర్నాకు అనుమతి కోరినా పోలీసులు నిర్బంధించడం పౌర హక్కులు కాలరాయటమేనన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల కుటుంబసభ్యులను పోలీస్‌ స్టేషన్‌లకు తీసుకెళ్లడం సైకో పాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ నిర్బంధాన్ని అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, అరెస్ట్‌ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-25T23:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising