ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో అరాచక పాలన

ABN, First Publish Date - 2023-03-05T23:46:37+05:30

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. కక్షసాధింపు, ప్రతికార దాడులు చేయడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేని చేతగాని ప్రభుత్వం ఉందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజం

మేదరమెట్ల, మార్చి 5: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. కక్షసాధింపు, ప్రతికార దాడులు చేయడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేని చేతగాని ప్రభుత్వం ఉందన్నారు. ఆదివారం మేదరమెట్లలో అద్దంకి, కొరిశపాడు, జె.పంగులూరు మండలాలతోపాటు అద్దంకి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశానికి రవికుమార్‌ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ముందుగా నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. గుండెపోటుతో మృతి చెందిన కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వరపుల రాజా మృతికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఎమ్మెల్యే రవికుమార్‌ మాట్లాడుతూ గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో దెబ్బతిన్న మూడు గేట్‌లు పెట్టలేనివారు మూడు రాజధానులు నిర్మిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని చేతగాని పాలనతో క్రాప్‌ హలీడేగా ప్రకటించే స్థితికి తెచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్ని వెళ్లగొట్టి కొత్త పరిశ్రమలు తెస్తామంటూ ఏర్పాటు చేసిన సమ్మిట్‌ను కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకా సాగర్‌ కాలువల మ రమ్మతుల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. సాగ ర్‌ రిజర్వాయర్‌లో నీరుఉన్నా పంటలకు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు వైసీపీ పాలనపై విసిగెత్తి పోయారన్నారు.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలల్లో టీడీపీ బలపరిచిన కంచర్ల శ్రీకాంత్‌ను మంచి మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రవికు మార్‌ పేర్కొన్నారు. అన్నిగ్రామాల్లో నాయకులు కంచర్ల శ్రీకాంత్‌ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు షమీంఖాన్‌, మన్నె రామారావు, కేవీ సుబ్బారావు, కొరిశపాడు, పంగులూరు, అద్దంకి మండల పార్టీ అధ్యక్షులు జాగర్లమూడి జయకృష్ణ, రావూరి రమేష్‌, కఠారి నాగేశ్వరరావు, అద్దంకి పట్టణ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు అన్నంగి మనోహరమ్మ, అద్దంకి పట్టణ మహిళ మహిళ అధ్యక్షురాలు పిన్నింటి శ్రీదేవి, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వరపర్ల సుబ్బారావు, మండలాల్లోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పె ద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising