ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ ఆ ఊరివాడే అల్లేశాడు!

ABN, First Publish Date - 2023-03-05T00:28:12+05:30

పొగాకు బ్యారన్‌ ఒక కొట్టుకు పట్టే ఆకును మరో కూలీ అల్లాడు. మండలంలోని వెన్నూరులో తొమ్మిది గంటల్లోనే 1,290 కర్రలకు పొగాకును అల్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వెన్నూరులో 9 గంటల్లోనే 1,290 కర్రలు పూర్తిచేసిన పచ్చాకు కూలీ

రూ. 5,000 నగదు ఇచ్చి సన్మానించిన రైతు

కొండపి, మార్చి 4 : పొగాకు బ్యారన్‌ ఒక కొట్టుకు పట్టే ఆకును మరో కూలీ అల్లాడు. మండలంలోని వెన్నూరులో తొమ్మిది గంటల్లోనే 1,290 కర్రలకు పొగాకును అల్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గ్రామస్థుల ప్రశంసలు అందుకున్నాడు. మండలంలోని చోడవరంలో 1,250 కర్రలను రామయ్య అనే పచ్చాకు కూలి ఒక్కడే శుక్రవారం 12గంటల్లో అల్లిన విషయం విదితమే. రామయ్యది పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నారం కాగా అదే గ్రామానికి చెందిన అక్కిదాసు నాగరాజు శనివారం వెన్నూరులో ఉదయం 8 గంటలకు అల్లకం ప్రారంభించాడు. సాయంత్రం ఐదు గంటలకు 1,290 కర్రలు పూర్తిచేసి ఔరా అనిపించాడు. వెన్నూరులోని పూనాటి శ్రీనివాసరావుకు చెందిన పొగాకు కొట్టుడుకు వచ్చిన ముఠాలో నాగరాజు సభ్యుడు. అతని ప్రతిభను మెచ్చిన రైతు శ్రీనివాసరావు రూ.5000 నగదు బహుమతిగా ఇవ్వడంతోపాటు సన్మానించారు.

Updated Date - 2023-03-05T00:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising