ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలోకి రాగానే వెలిగొండ పూర్తి

ABN, First Publish Date - 2023-02-23T23:52:46+05:30

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోనికి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోనికి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని గుర్రపుసాల గ్రామంలో గురువారం సాయంత్రం ‘ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి, ఉద్యోగల కల్పన, పెట్టుబడులు తీసుకొచ్చి నాడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడన్నారు. యువత ఉద్యోగల కోసం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను తీసుకొచ్చారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. టీడీపీ నాయకులపై దాడులు చేసి కేసులు పెట్టడం మినహా చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా దాహం కేకలు వినబడుతున్నాయన్నారు. గుర్రపుసాల గ్రామప్రజలు తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎరిక్షన్‌బాబుకు విన్నవించారు.. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బయ్య, మాజీ సర్పంచులు కంచర్ల సత్యనారాయణగౌడ్‌, చెవుల అంజయ్య, ముండ్ల దానియేలు, కాశీకుండతాండ సర్పంచి ఎం మంత్రునాయక్‌, టీడీపీ నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, పాలడుగు వెంకటకోటయ్య, గుండారపు వెంకట్రావు, మెడబలిమి అచ్యుతరావు, దొడ్డా శేషాద్రి, ఎం దేవయ్య,శింగారపు చెన్నయ్య, కొత్త భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

పొదిలి రూరల్‌ : రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని టీడీపీ మాజీ శాసన సభ్యుడు కందుల నారాయణరెడ్డి కోరారు. గురువారం మండలంలోని పూనేవారిపాలెం, నల్లారెడ్డిపాలెం గ్రామాల్లో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు. అందుకు ఉదాహరనే గన్నవరం ఘటన అని పేర్కోన్నారు. పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి వారికి విలువలేకుండా చేస్తున్నారని ఎద్దేవ చేశారు. దౌర్జన్యంగా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా తిరిగి టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించడం చూస్తుంటే పోలీస్‌ వ్యవస్థ ఎంతనిర్వీర్యం అవుతుందో అర్ధమౌతుందన్నారు. ఇలాంటి రాక్షస పాలనను రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వివేకానందరెడ్డి హత్యవెనుక ఎవరి హస్తం ఉందో ప్రజలు ఇప్పుడైన గుర్తించాలన్నారు. కనుక రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వ అధికారం చాలా ముఖ్యమని అందుకు అలుపెరుగని కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : ముస్లిం మైనార్టీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక 9వ వార్డులో పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌ నివాసంలో పట్టణ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అందజేసిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను అనేక రకాలుగా ఇబ్బందులకు సరిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి, నాయకులు షేక్‌ మౌలాలి, షాకీర్‌, ఉస్సేన్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడమే వైసీపీ ప్రభుత్వ పని అని టీడీపీ మండల అధ్యక్షుడు మేకల వలరాజు అన్నారు. మండలంలోని గొల్లపల్లి గ్రామంతోపాటు త్రిపురాంతకం 1, 2 యూనిట్ల పరిధిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు ఆదేశాలతో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా వలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ కనుసన్నల్లో టీడీపీ కార్యాలయాలు, ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. ప్రజలకు వైసీపీ చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని 60 ఏళ్లు వెనక్కు తీసుకెళ్ళారని విమర్శించారు. రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవినేని చలమయ్య, వి.ఆంజనేయులు, ఊట్ల వెంకటేశ్వర్లు, ఎం.అల్లూరిరెడ్డి, జి.వెంకటనారాయణ, జి.సునీల్‌, ఓరుగంటి వెంకటయ్య, గాంధీ పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

పుల్లలచెరువు : మండలంలోని 33 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు నిర్మించిన ముటుకుల ప్రాజెక్టు నుంచి ముటుకుల గ్రామంలో కూడా నీరు రావడం లేదని నీళ్లు ఎక్కడ ఇస్తున్నారో..? అధికార పార్టీ నాయకులు చెప్పాలని టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌ అన్నారు. గురువారం మండలంలోని ముటుకులలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మం డల కేంద్రం పుల్లలచెరువుకు జూనియరు కళాశాల తెస్తానని చెప్పిన మంత్రి సురేష్‌ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. విద్యశాఖ మంత్రిగా పనిచేసి కూడా జానియర్‌ కళాశాల తీసుకురాలేక పోయారని విమర్శించారు. పుల్లలచెరువు- ఎర్రగొండ పాలేనికి డబుల్‌ రోడ్డు వేయిస్తానని చెప్పిన మంత్రి మూడేళ్లు దాటిన కనీసం సింగిల్‌ రోడ్డు కుడా వేయలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునగాల రామిరెడ్డి, మాజీ సర్పంచి కిష్ణయ్య, గద్దె వెంకటేశ్వర్లు, టి వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-23T23:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising