అధ్వానం.. చీరాల ఆర్టీసీ బస్టాండ్
ABN, First Publish Date - 2023-08-02T22:47:27+05:30
చీరాల బస్టాండ్‌లో సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీరు తాగే వద్ద చెత్తా చెదారం, వ్యర్థ జలాలతో వస్తున్న కంపుతో నరకం చూస్తున్నారు. బస్సుల కోసం నిరీక్షించే సమయంలో మరుగుదొడ్లు వినియోగించేందుకు వెళితే అక్కడ అపరిశుభ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అవస్థల్లో ప్రయాణికులు
చీరాలటౌన్, ఆగస్టు 2 : చీరాల బస్టాండ్‌లో సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీరు తాగే వద్ద చెత్తా చెదారం, వ్యర్థ జలాలతో వస్తున్న కంపుతో నరకం చూస్తున్నారు. బస్సుల కోసం నిరీక్షించే సమయంలో మరుగుదొడ్లు వినియోగించేందుకు వెళితే అక్కడ అపరిశుభ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్లాట్ ఫాంపై పెచ్చులు ఊడి ఉండడంతో అదుపుతప్పి పడిపోతున్నా రు. బస్టాండ్‌లోపలికి వెళ్లేందుకు ప్రధానమార్గం శిథిల మై, రాళ్లతో ఇబ్బందిగా మారింది. ఇక్కడ వర్షం ప డితే మార్గంలో దుర్గంధాలతో జలమయమవుతుంది. బస్టాం డ్‌లో సమస్యలు పరిష్కరించాలని ప్రయా ణికులు వేడుకుంటున్నారు. చీరాలలో 1993 సెప్టెంబర్‌లో ఆర్టీసీ బస్టాండ్ ప్రా రంభమైంది. ఈక్రమంలో సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రారంభమైన బస్టాండు నేడు ఎలాంటి వస తులకు నోచుకోవడం లేదు. దీంతో ఇక్కడి నుంచి వేరే గ్రామాలకు వెళ్లేవారు సౌకర్యాలు లేక గంటల సయం బస్సులకు నిరీక్షించే సయంలో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేక నిల్చొనే ఉండాల్సిన దుస్థితి ఉంది. గతంలో పరిసరాల పరిశుభ్రత, వసతులతో కళకళలాడేది. అటువంటి బ స్టాండు నేడు ఆధునీకరణకు నోచుకోక శిథిలావస్థకు చే రుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ డిపోలో 76 సర్వీసులు ఉం డగా, 84 బస్‌లు నడుస్తున్నాయి. అందులో 41 ఆర్టీసీ బస్సులు ఉండగా, 35 హయ్యర్ బస్‌లు ఉన్నాయి. వీ టిలో కూడా కొన్ని మరమ్మతులకు చేరువలో ఉన్నట్లు సమాచారం. బస్సులు మొరాయించేటప్పుడు సిబ్బందితో పాటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్‌లో చాలా ప్లేస్ ఖాళీ ఉండగా ఎక్కడా లేనట్టు తాగునీరు సమీపంలో మరుగుదొడ్లు నిర్మాంచారు. దీంతో మంచి నీరు తాగేందుకు వచ్చిన వారు ము క్కులు మూసుకుని బతుకుజీవుడా అంటూ వెళ్లిపోతున్నారు. ప్లాట్ ఫాంపై పలుచోట్ల నాపరాళ్లు పైకిలేచి అధ్వానంగా మారాయి. దీంతో మహిళలు, వృద్ధులు పడిపోతున్నారు. లైట్‌లు లేవు, ఫ్యాన్‌లు తిరగడం లే దు. ఆర్టీసీ ప్రాంగణంలోనే కొందరు ప్రయాణికుల ఎ దురుగానే మూత్ర విస్తర్జన చేస్తున్నారు.
Updated Date - 2023-08-02T22:47:27+05:30 IST