గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు
ABN, First Publish Date - 2023-08-04T01:31:10+05:30
గడువు తీరిన ఆహార పదార్ధాలు విక్రయించరాదని ఫుడ్ ఇన్స్‌పెక్టర్ నరసింహులు అన్నారు.
మార్కాపురం, ఆగస్టు 3: గడువు తీరిన ఆహార పదార్ధాలు విక్రయించరాదని ఫుడ్ ఇన్స్‌పెక్టర్ నరసింహులు అన్నారు. పట్టణానికి చెందిన ఒక వినియోగదారుడి ఫిర్యాదు మేరకు మెయిన్‌బజారులోని సాయికృష్ణ ఫ్యాన్సీ దుకాణంలో గురువారం మున్సిపల్ ప్రజారోగ్యఅధికారి నాయబ్‌రసూల్‌తో కలిసి తనిఖీలు నిర్వహించారు. తయారీ తేదీ లేని తినుబండారాల ప్యాకెట్లను సీజ్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. సాయికృష్ణ ఫ్యాన్సీ షాపుకు లైసెన్స్ లేనట్లు గుర్తించారు. 10 రోజులలోపు లైసెన్స్ తీసుకోవాలని హెచ్చరించారు. సీజ్ చేసిన తినుబండారాలకు సంబంధించి ల్యాబ్ నివేదిక వచ్చిన అనంతరం దుకాణదారుపై చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2023-08-04T01:31:10+05:30 IST