అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN, First Publish Date - 2023-08-22T00:19:16+05:30
స్పందనలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ దినే్‌షకుమార్ ఆధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్ యువర్ కలెక్టర్, స్పందన కార్యక్రమంలో పలుప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు. అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా సమస్యలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఒంగోలు(కలెక్టరేట్), ఆగస్టు 21 : స్పందనలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ దినే్‌షకుమార్ ఆధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్ యువర్ కలెక్టర్, స్పందన కార్యక్రమంలో పలుప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు. అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా సమస్యలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే శ్రీనివాసులు, డీఆర్వో శ్రీలత, డిప్యూటీ కలెక్టర్లు ఉమాదేవి, చెన్నయ్య, లోకేశ్వరరావు, నారదముని తదితరులు ఉన్నారు.
ఫ తమ భూమిని ఆన్‌లైన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని త్రిపురాంతకం మండలం రామసముద్రంకు చెందిన టి. పెద వెంకయ్య ఫిర్యాదు చేశారు. అనేక సార్లు రెవెన్యూ అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని, అందువల్ల తనకు న్యాయం చేసి అదుకోవాలని కోరారు.
ఫ తమ గ్రామానికి తాగునీరు రావడం లేదని మర్రిపూడి మండలం అయ్యపురాజుపాలెంకు చెందిన కే మాధవరావు ఫిర్యాదు చేశారు. మంచినీటిని అందించాలని సంబంధిత అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని, మంచినీరు ఇచ్చి అదుకోవాలని కోరారు.
ఫ తమ భూమిని ఇతరులు అక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని కురిచేడు మండలం పెద్దవరంకు చెందిన గురుస్వామి ఫిర్యాదు చే శారు. 168 సర్వేనెంబరులోని భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని న్యాయం చేసి ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ఇలా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు.
Updated Date - 2023-08-22T00:19:16+05:30 IST