ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ద్విముఖ వ్యూహ యాత్ర

ABN, First Publish Date - 2023-06-21T00:58:00+05:30

భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్రలు ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రారంభం కానున్నాయి.

భవిష్యత్‌కు గ్యారెంటీ చైనత్యరథం వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల, ఇతర నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటు సూపర్‌ సిక్స్‌ హామీల ప్రచారం

అటు సమస్యలు, వైసీపీ వైఫల్యాలపై సమరభేరి

ఎక్కువ గ్రామాలు కలిసొచ్చే విధంగా పర్యటనలకు రూపకల్పన

గ్రామాల్లోని కార్యకర్తల్లో కదలిక కూడా లక్ష్యమే

నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో టీడీపీ బస్సు యాత్రలు ప్రారంభం

ఇటు ఒంగోలు, అటు చీరాలలో రెండురోజుల పర్యటనలు

భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్రలు ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రారంభం కానున్నాయి. ద్విముఖ వ్యూహంతో ఆపార్టీ నాయకులు కార్యక్రమాన్ని చేపట్టినట్లు కనిపిస్తోంది. ఎక్కువ గ్రామాల్లో యాత్ర సాగించడంతోపాటు అత్యధిక మంది ప్రజలను కలిసే విధంగా చూస్తున్నారు. అదేవిధంగా కేడర్‌లో ఉత్తేజాన్ని నింపేలా అన్నింటికీ మించి చంద్రబాబు ప్రకటించిన తొలి మేనిఫెస్టోను ప్రచారం చేస్తూ ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. టీడీపీ నేతలంతా ఉమ్మడిగా ఈ బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశంలోని ఐదు నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమం బుధవారం మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రారంభంకానుంది. అలాగే బాపట్ల లోక్‌సభ పరిధిలో జరిగే బస్సుయాత్ర బుధవారం చీరాల నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. తద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు రోజులపాటు టీడీపీ బస్సుయాత్రలు సాగనున్నాయి.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్యం దిశగా కార్యక్రమాల వేగం పెంచింది. అందులో భాగంగా బస్సు యాత్రను చేపట్టింది. ఇటీవల మహానాడులో ప్రకటించిన ఆరు సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రచారంతోపాటు దారిపొడవునా స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆ పార్టీ నేతలు కార్యక్రమాలను రూపొందించారు. భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో ప్రజా చైతన్య బస్సుయాత్రకు సిద్ధమయ్యారు. రాష్ట్ర పార్టీ ముద్రించిన కరపత్రాలతోపాటు సెల్ఫీ చాలెంజ్‌లతో స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఐదు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం ఒక గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సూపర్‌సిక్స్‌ హామీలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. రచ్చబండ జరిగే గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలను అక్కడికి ఆహ్వానిస్తున్నారు. రచ్చబండ అనంతరం వచ్చిన వారందరితో బస్సు యాత్రలో వెళ్లే సుమారు 30మంది నాయకులు సహపంక్తి భోజనాలు చేసి రాత్రుళ్లు అక్కడే బసచేస్తారు. మరుసటిరోజు ఉదయం సుమారు 2 గంటలపాటు స్థానిక ప్రజలతో మమేకమై వారి మనోభావాలు తెలుసుకుంటారు. తిరిగి 10 గంటల తర్వాత నుంచి రెండోరోజు బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నుంచి మరో నియోజకవర్గంలోకి ప్రవేశించి ఆ రోజంతా ఆ సెగ్మెంట్‌లో కొనసాగుతుంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..

సూపర్‌సిక్స్‌ హామీలలో భాగంగా రానున్న ఐదు సంవత్సరాలలో రూ.6ల క్షల మేర ప్రతి ఇంటి కీ ఆదాయం ఎలా సమకూరబోతుందో ప్రజలకు వివరిస్తారు. ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా 18 నుంచి 59 సంవత్సరాలలోపు వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.1500, చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ.15వేలు ఇవ్వటంతో పాటు ప్రతి ఇంటికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్న టీడీపీ మ్యానిఫెస్టోలోని అంశా లను వివరిస్తారు. వీటితోపాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానికంగా ప్రభుత్వ వైఫల్యాలను వివరించేలా సెల్ఫీల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదాహరణకు కార్యక్రమం తొలిరోజైన బుధవారం ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లేలోపు నాలుగు సెల్ఫీ పాయింట్ల కార్యక్రమాన్ని నిర్వహించ బోతున్నా రు. తొలుత ఒంగోలు నుంచి కొత్తపట్నం వరకు గత టీడీపీ ప్రభుత్వ కాలంలో నిర్మించిన డబుల్‌రోడ్డు నిర్మాణాన్ని చూపే సెల్ఫీ కార్యక్రమాన్ని చేపడతారు. ఆ తర్వాత కొప్పోలు సమీపంలో టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన టిడ్కో గృహనిర్మాణాల కార్యక్రమం అర్ధంతరంగా ఆగిపోవటం, ఆ విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై సెల్ఫీ దిగుతారు. అనంతరం కొత్తపట్నం రోడ్డులో అల్లూరుకి సమీపంలో టీడీపీ ప్రభుత్వకాలంలో నిర్మించిన బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంపై సెల్ఫీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత బకింగ్‌హామ్‌ కెనాల్‌పై టీడీపీ ప్రభుత్వం చేపట్టి 80శాతం పూర్తిచేసిన బ్రిడ్జి నిర్మాణాన్ని ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయక పోవటంపై సెల్ఫీ చాలెంజ్‌ చేస్తారు. దామచర్ల జనార్దన్‌ సారథ్యంలో ఒంగోలులో ప్రారంభమయ్యే బస్సు యాత్ర మధ్యాహ్నానికి కొత్తపట్నంలోకి ప్రవేశించి నల్లూరి గార్డెన్స్‌లో భోజన విరామానికి ఆగుతుంది. ఆ తర్వాత నాలుగు గంటలకు బయలుదేరి నాలుగున్నరకు పల్లెపాలెం చేరుకుంటుంది. అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ బస్సుయాత్రలో పాల్గొనేందుకు ఒంగోలు లోక్‌సభ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, లోక్‌సభ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, ఇతర ముఖ్య నాయకులు బుధవారం ఉదయానికి ఒంగోలు చేరనున్నారు.

అటు జోన్‌-3 యాత్ర

మరోవైపు బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న చీరాల నియోజకవర్గం ఈపురుపాలెంకు జోన్‌ 3 బస్సు యాత్ర బుధవారం మధ్యాహ్నానికి చేరుతుంది. ఈపురుపాలెంలో రచ్చబండ, పల్లెనిద్ర నిర్వహిస్తారు. గురువారం పర్చూరు నియోజకవర్గం నూతలపాడులో రచ్చబండ కార్యక్రమం, శుక్రవారం సంతనూతలపాడు నియోజకవర్గంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే కార్యక్రమాలు ఉంటాయి. రాత్రికి మద్దిపాడు మండలంలోని నందిపాడులో పల్లెనిద్ర జరుగుతుంది. ఇందుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-21T00:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising