పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN, First Publish Date - 2023-01-15T01:48:24+05:30
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు.
తర్లుపాడు, జనవరి 14: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 154 మంది పూర్వపు విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ముప్పై ఏళ్ల క్రితం చదువుకుంటున్న రోజులు, వారు చేసిన అల్లరి, ఆటల పాటలు, తమ స్నేహితులతో కలిసి ఆనందంగా పలకరించు కొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. కాసేపు బాల్యంలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఏమి ఉద్యోగాలు చేస్తోంది... ఎక్కడెక్కడ స్థిరపడింది తెలుసుకున్నారు. అనంతరం చదువు నేర్పిన గురువులను ఎంసీ.కృష్ణారెడ్డి, జే.కృష్ణమూర్తి, ఎన్.బసిరెడ్డి, వడ్లమూడి వీరయ్య, హనివి లాసిని, గర్రె శ్రీనివాసులు, డీవీ.నారాయణరెడ్డి లను పూలమాలలతో ఘనంగా సన్మానిం చారు. పూర్వపు విద్యార్థులు కశ్శెట్టి జగన్ బాబు మాట్లాడుతూ.. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు. పూర్వపు విద్యార్థులైన నబిరసూల్, టి.రామారావు, ఏబీ నారాయణ, పి.వేణుగోపాల్, సేతుల శ్రీనివాసులు, జవ్వాజి జనార్థన్, ఉమారెడ్డి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. అనంతరం పూర్వపు విద్యార్థుల అందరి సహకారంతో రూ.4 లక్షలతో పాఠశాలలో స్టేజీ నిర్మాణం చేశారు. ఈ స్టేజీ నిర్మాణాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ, సర్పంచ్ పి.వరాలు, ఎంపీటీసీ సభ్యులు అంకమ్మ, మురారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-15T01:48:25+05:30 IST