జంధ్యాల శాస్త్రి’కి అంతిమ వీడ్కోలు
ABN, First Publish Date - 2023-06-26T00:00:21+05:30
నర్సింగోలు గ్రామంలోని శ్రీ గంగాపార్వతీ సమేత రామలింగేశ్వర, ప్రత్యేక లింగరూప శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు, జ్యోతిష పండితుడు జంధ్యాల చంద్రభాస్కరశాస్త్రి గురూజీ అంతిమయాత్ర ఆదివారం మధ్యాహ్నం శోకతప్తహృదయాలతో సాగింది.
‘
ఎమ్మెల్యే స్వామి, సినీ డైరెక్టర్ బోయపాటి నివాళి
జరుగుమల్లి (కొండపి), జూన్ 25 : నర్సింగోలు గ్రామంలోని శ్రీ గంగాపార్వతీ సమేత రామలింగేశ్వర, ప్రత్యేక లింగరూప శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు, జ్యోతిష పండితుడు జంధ్యాల చంద్రభాస్కరశాస్త్రి గురూజీ అంతిమయాత్ర ఆదివారం మధ్యాహ్నం శోకతప్తహృదయాలతో సాగింది. భాస్కరశాస్త్రి భౌతిక కాయాన్ని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఆధ్యాత్మిక ప్రవచన కర్త శ్రీరామ్‌శర్మ గురూజీ సందర్శిం చి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను చంద్రభాస్కరశాస్త్రి కొడుకు మల్లికార్జునశర్మ నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భాస్కరశాస్త్రి గురూజీ శిష్యులు, భక్తులు పరిసర గ్రామాల నాయకులు పాల్గొన్నారు. సినీ డైరెక్టర్ ఈసందర్భంగా ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఎన్నో సూచనలు, సలహాలు, ఆధ్మాత్మిక విషయాలను గురూజీతో పంచుకున్నానని, ఇటువంటిది గురూజీని అచేతనంగా ఈస్థితిలో చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-06-26T00:00:21+05:30 IST