ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెరవేరిన సిలోన్‌ కాలనీవాసుల కల

ABN, First Publish Date - 2023-04-03T23:16:44+05:30

సిలోన్‌ కాల నీ వాసుల నివేశ స్థలాల సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ చెప్పారు. స్థానికంగా రూ. 40 లక్షల వ్యయంతో ఆధునికీకరించిన ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం రాత్రి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, జేసీ శ్రీనివాసులు ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

నివేశన స్థలాల పట్టాల పంపిణీ

చీరాల, ఏప్రిల్‌ 3: సిలోన్‌ కాల నీ వాసుల నివేశ స్థలాల సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ చెప్పారు. స్థానికంగా రూ. 40 లక్షల వ్యయంతో ఆధునికీకరించిన ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం రాత్రి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, జేసీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సరోజిని అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడు తూ సిలోన్‌ కాలనీవాసులు 40 సంవత్సరాల నుంచి నివేశన స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి సమస్యను కరణం వెంకటేష్‌ తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. సుదీర్ఘకాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ జీవోలలో ఉన్న కొన్ని ప్రత్యేక అంశాల నేపథ్యంలో వేరే ప్రాంతాలలో చేసిన విధానాన్ని తమ దృష్టికి తీసుకువచ్చా రన్నారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు పనిచేసే అధికారులు, ఆ చట్టాలను చేసే ప్రజాప్రతనిధులు సమన్వయంతో పనిచేస్తే వచ్చే స త్ఫలితాలకు ఎమ్మెల్యే బలరాం సహకరించిన తీరుకు ఇదొక ఉదాహరణన్నారు. జేసీ శ్రీనివాసులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇదొక కేష్‌ స్టడీగా భావించి భవిష్యతలో కూడా ప్రజలకు మెరుగైన సేవ లు అందించాలన్నారు. ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ సమిష్టి కృషితో పాటు అధికారులు అంకితభావంతో పనిచేస్తే వచ్చే ఫలితాలకు నిదర్శనమన్నారు. వైసీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జి వెంకటేష్‌ మాట్లాడుతూ సిలోన్‌ కాలనీవాసులు పట్టాల పంపిణీ కార్యక్రమంలో కొన్ని నెలల క్రితం జరగాల్సిందన్నారు. ఎన్నికల కోడ్‌, మరికొన్ని కారణాలతో జాప్యం జరిగిందన్నారు. అనంతరం పట్టాలు పంపిణీ చేశారు. తదనంతరం ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో రూ.65లక్షల వ్యయంతో నిర్మించిన విద్యార్థుల భోజనశాలను ప్రారంభించారు.

అంతకుముందు వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్వో శివజ్యోతి, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్లు బొనిగల జైసన్‌బాబు, శిఖాకొల్లి రామసుబ్బులు, కౌన్సిలర్‌ బాలకృష్ణ, దేశాయిపేట గ్రామ ప్రతినిఽధులు లేళ్ల శ్రీధ ర్‌, దంతం హనుమంతరావు, కట్టా గంగయ్య, సుబ్బారాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి, డీఈఈ ఏసయ్య, చీరాల, వేటపాలెం మండలా తహసీల్దార్లు ప్రభాకరరావు, పార్వతి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising