ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది విద్యార్థులకు తప్పని రవాణా కష్టాలు

ABN, First Publish Date - 2023-04-03T22:43:23+05:30

దొనకొండలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యే గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం బస్‌ సౌకర్యం కల్పిస్తామంటూ చేసిన ప్రకటనలు ఆచరణలో తేలిపోయాయని తల్లితండ్రులు వాపోయారు.

పరీక్షా కేంద్రానికి ఆటోలో వెళ్తున్న విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దొనకొండ, ఏప్రిల్‌ 3 : దొనకొండలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యే గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం బస్‌ సౌకర్యం కల్పిస్తామంటూ చేసిన ప్రకటనలు ఆచరణలో తేలిపోయాయని తల్లితండ్రులు వాపోయారు. దొనకొండకు బస్సు ఏర్పాటు చేయాలంటూ పొదిలి ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆరోపించారు. తప్పనిసరై ఆటోలను మాట్లాడుకొని రాకపోకలు సాగించామన్నారు. ఆరవళ్లిపాడు, తెల్లబాడు, గంగదేవిపల్లి, చందవరం, కొచ్చెర్లకోట, మంగినపూడి జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, నరసింహనాయునిపల్లి, పెద్దన్నపాలెం, దొండపాడు, చిన్నగుడిపాడు, రామిరెడ్డిపల్లి, పోలేపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు బస్సు సౌకర్యం లేక ఆటోలలో వచ్చి వెళ్లారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థుల ఇబ్బందులు గుర్తించి పరీక్షల సమయంలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-04-03T22:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising