ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలోనే పెట్రో మంట!

ABN, First Publish Date - 2023-07-21T03:03:11+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం! దేశంలో ఎక్కడా ఈ స్థాయి ధరలు లేవు! ఈ మాటలు పెట్రోమంట భరించలేని సామాన్య వాహనదారులో, ప్రతిపక్షాలో అంటున్నవి కావు! స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన విషయమిదీ.

దేశంలో ఎక్కడా ఇంత ధర లేదు

లోక్‌సభలో మోదీ సర్కారు ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం! దేశంలో ఎక్కడా ఈ స్థాయి ధరలు లేవు! ఈ మాటలు పెట్రోమంట భరించలేని సామాన్య వాహనదారులో, ప్రతిపక్షాలో అంటున్నవి కావు! స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన విషయమిదీ. గురువారం లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి స్పందిస్తూ.. ఈ విషయాలు వెల్లడించారు. ‘‘ఈ నెల 18 నాటికి ఏపీలో లీటరుకు పెట్రోల్‌ ధర రూ.111.87, డీజిల్‌ ధర రూ.99.61 ఉంది. రాష్ట్రంలో అమరావతిని రెఫరెన్సు సిటీగా పరిగణనలోకి తీసుకుని తీసిన లెక్కలవి’’ అని మంత్రి వివరించారు. కాగా, ఏపీ హైకోర్టులో తొమ్మిది న్యాయమూ ర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ తెలిపారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, ‘ప్రసాద్‌’ పథకం కింద రూ.54.04 కోట్లతో ప్రతిపాదించిన సింహాచలం దేవస్థానం అభివృద్ధి ప్రాజెక్టుకు గతేడాది డిసెంబరులో ఆమోదముద్ర వేశామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-07-21T03:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising