పవన్‌తో పంచకర్ల భేటీ
ABN, First Publish Date - 2023-07-17T01:19:02+05:30
వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మర్యా దపూర్వకంగా కలిశారు.
20న జనసేనలో చేరిక
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), మంగళగిరి, జూలై 16: వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మర్యా దపూర్వకంగా కలిశారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాల యంలో పంచకర్ల తన అనుచరులను పవన్‌కు పరిచయం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జనసేన ఆశయాలు, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ పడుతున్న తపన చూసి జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నా. ఈ నెల 20న నా అనుచరులతో వచ్చి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతాను. పార్టీ ఉన్నతి కోసం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తా’’ అని పంచకర్ల తెలిపారు.
Updated Date - 2023-07-17T01:58:44+05:30 IST