13న మాదిగల ఆత్మీయ సమావేశం
ABN, First Publish Date - 2023-06-11T03:24:21+05:30
మాదిగల ఆత్మీయ సమావేశాన్ని 13న మంగళగిరిలోని టీడీపీ ప్రధానకార్యాలయంలో నిర్వహించనున్నట్లు టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎ్‌స.రాజు తెలిపారు.
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): మాదిగల ఆత్మీయ సమావేశాన్ని 13న మంగళగిరిలోని టీడీపీ ప్రధానకార్యాలయంలో నిర్వహించనున్నట్లు టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎ్‌స.రాజు తెలిపారు. ‘‘వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుతోపాటు, ప్రభుత్వ పదవుల్లో మాదిగలకు పెద్దపీట వేస్తానని, జిల్లాల ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం జీవో 25ను అమలు చేస్తామని మహానాడు వేదికగా హామీ ఇచ్చిన చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపేందుకు సమావేశం నిర్వహిస్తున్నాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నాయకులు సమావేశానికి హాజరవుతారు’’ అని రాజు తెలిపారు.
Updated Date - 2023-06-11T03:24:21+05:30 IST