ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌ వాల్యూ పెంపు వద్దు: అశోక్‌బాబు

ABN, First Publish Date - 2023-06-02T04:38:11+05:30

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువల పెంపుదలపై నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. గురువారం టీడీపీ జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువల పెంపుదలపై నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్‌ వ్యాల్యూ పెంపు నిర్ణయంతో ఇప్పటికే కుదేలైన రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారం అవుతుంది. కెడ్రాయ్‌ వంటి సంస్థలు భూముల విలువ పెంచొద్దని మొత్తుకున్నా.. వినకుండా ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్‌రెడ్డి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలు చతికిల పడ్డాయి. గతంలో ఆస్తి పన్నుని అద్దె ఆధారిత పన్నుల్లో చేర్చారు. కానీ ఇప్పుడు జగన్‌ మార్కెట్‌ వ్యాల్యూ పెంచడం వల్ల వాణిజ్యపరమైన ఆస్తులన్నింటి విలువ భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన భూములతో పాటు భవనాల విలువ కూడా పెరుగుతుంది’’ అశోక్‌బాబు వివరించారు.

Updated Date - 2023-06-02T04:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising