గ్రామ కంఠాలకు కొత్త నిబంధనలు
ABN, First Publish Date - 2023-07-14T00:28:12+05:30
గ్రామ కంఠాలపై పంచాయతీ రాజ్‌శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. వాస్తవ గ్రామకంఠాలు.. ఆర్‌ఎ్‌సఆర్ రికార్డులు, విలేజ్ మ్యాప్‌లలో యథావిధిగా ఉంటాయని స్పష్టంచేసింది.
పంచాయతీరాజ్‌శాఖ వెల్లడి
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): గ్రామ కంఠాలపై పంచాయతీ రాజ్‌శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. వాస్తవ గ్రామకంఠాలు.. ఆర్‌ఎ్‌సఆర్ రికార్డులు, విలేజ్ మ్యాప్‌లలో యథావిధిగా ఉంటాయని స్పష్టంచేసింది. కొత్తగా గ్రామకంఠాల్లో చేరిన భూములకు కొత్త నిబంధనల ప్రకారం సర్వే చేస్తారని తెలిపింది. కొత్తగా గుర్తించిన ‘పొడిగించిన గ్రామ కంఠాల’లోనూ రెండు రకాలుంటాయని పేర్కొంది. గ్రామ కంఠం భూములను ఎలా వినియోగిస్తున్నారో గుర్తించడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశమని తెలిపింది. వాస్తవ గ్రామకంఠాలకు పక్కనే నివాస, ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తున్న భూములను గుర్తించి వాటిని ‘పొడిగించిన గ్రామ కంఠాలు’గా ప్రకటిస్తారని పేర్కొంది. కొత్తగా గుర్తించే భూముల్లో కనీసం పది ఇళ్లు లేదా ఇళ్ల నిర్మాణాలు ఉండాలని, కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండాలని స్పష్టం చేసింది. కట్టడాలకు నిషేధిత ప్రాంతాల వెలుపల ఆ భూములు ఉండాలని తెలిపింది. సర్వే అనంతరం కొత్తగా గుర్తించిన భూములకు రికార్డులను పంచాయతీల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటివరకూ గందరగోళ పరిస్థితుల్లో ఉన్న ఈ భూములకు ఇకపై చట్టబద్ధత ఏర్పడుతుంది.
Updated Date - 2023-07-14T00:28:12+05:30 IST