ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో రైతులకు తీరని అన్యాయం

ABN, First Publish Date - 2023-09-25T22:45:28+05:30

వైసీపీ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని పలువురు రైతు నాయకులు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం కూడా కావలి టీ

25కెవిఎల్‌ 5 : దీక్షా శిబిరంలో సమస్యలు వివరిస్తున్న తెలుగు రైతు

కావలి, సెప్టెంబరు25: వైసీపీ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని పలువురు రైతు నాయకులు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం కూడా కావలి టీడీపీ కార్యాలయం వద్ద రిలే దీక్షలు కొనసాగించారు. ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షల్లో రైతు సంఘం నేతలు, రైతువిభాగం సభ్యులు, మహిళారైతులు కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ ఇలాంటి కక్ష సాధింపు సీఎంను రాష్ట్ర ప్రజలు ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. పలువురు రైతు నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

కందుకూరు : చంద్రన్నా... నీ వెంటే మేమంతా.. అంటూ కందుకూరులో మహిళలు కదం తొక్కారు. రిలేదీక్షలలో సోమవారం తెలుగు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఆయన సతీమణి తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు దివి సౌభాగ్య తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కందుకూరుతో పాటు అన్ని మండలాల నుంచి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా వారు సోమేశ్వరాలయం వద్దకు చేరుకుని అక్కడ నల్ల బెలూన్లతో నిరసన చేపట్టారు. చంద్రబాబు తక్షణం విడుదల కావాలని కోరుతూ ఆలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అక్కడినుంచి ప్రదర్శనగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా పామూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని రిలే దీక్షలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంటూరి సౌజన్య, ముచ్చు లక్ష్మీరాజ్యం, జొన్నలగడ్డ రమణమ్మ, సన్నెబోయిన ప్రభావతి, మన్నం శైలజ, గురజాల ఆంతోనమ్మ, బత్తిన ఆదెమ్మ, కల్లూరి శైలజ, సింగమనేని పద్మ, మర్రిబోయిన మాధవి, తోకల మాధవి, మయూరి, రసూల్‌బీ తదితరులు పాల్గొన్నారు.

కలిగిరి : జగన్‌ ప్రభుత్వం చంద్రబాబుతోపాటు ఎంతమందిపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదేలేదని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద రిలేదీక్షల్లో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిజ్జం కృష్ణారెడ్డి, బీవీ రామారావు, చీమల తాతయ్య, ఒంటేరు జయచంద్రారెడ్డి, దంతులూరి వెంకటేశ్వర్లు, గంజాం రాఘవేంద్ర, చీమల తాతయ్య, కల్లూరు చంద్రమౌళి, ఊసా మాల్యాద్రి, లెక్కల రాంబాబు, బత్తల భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

బిట్రగుంట : చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని టీడీపీ మండల కన్వీనర్‌ మాలేపాటి నాగేశ్వరావు అన్నారు. బోగోలులోని నాగుల పుట్ట వద్ద టీడీపీ నేతలతో కలసి సోమవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పుట్టా సుబ్బారావు, మస్తాన్‌నాయుడు,సాదనాలవెంకమనాయుడు, ఎస్‌.శేఖర్‌, కుపూరు సుబ్బయ్య, సీహెచ్‌.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు కడిగిన ముత్యంలా విడుదల కావాలి

చంద్రబాబు కడిగిన ముత్యంలా విడుదల కావాలని పీఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు పసుపులేటి సుధాకర్‌ అన్నారు. బోగోలు మండలం చెంచులక్ష్మీపురం కోదండరామాలయంలో చంద్రబాబు త్వరగా విడుదల కావాలని సోమవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెంచులక్ష్మీపురం నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

Updated Date - 2023-09-25T22:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising