ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్‌జిల్లా వాలీబాల్‌ పోటీల ప్రారంభం

ABN, First Publish Date - 2023-06-08T23:12:19+05:30

మండలంలోని అలిచర్లబంగారు పాలెంలో గురువారం అంతర్‌ జిల్లా వాలీబాల్‌ పోటీలను కాండ్ర యువ నేస్తం నిర్వాహకులు కాండ్ర సతీష్‌ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య.. విజ్ఞానాన్ని పెంచితే, క్రీడలు మానసిక వికాసానికి దో

3బిటిటిఆర్‌8. వాలీబాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న కాండ్ర సతీష్‌నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట, జూన్‌ 8: మండలంలోని అలిచర్లబంగారు పాలెంలో గురువారం అంతర్‌ జిల్లా వాలీబాల్‌ పోటీలను కాండ్ర యువ నేస్తం నిర్వాహకులు కాండ్ర సతీష్‌ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య.. విజ్ఞానాన్ని పెంచితే, క్రీడలు మానసిక వికాసానికి దోహద పడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈనెల 11వ వరకు జరిగే ఈ పోటీలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరప్రాంత గ్రామాలకు చెందిన 40 టీమ్‌లు పేర్లు నమోదు చేసుకున్నట్లు పోటీల నిర్వాహకులు జగదీష్‌, తిరుపతిరావు, వసంత కుమార్‌లు తెలిపారు. విజేతలకు వరుసగా రూ. 30 వేలు రూ. 20వేలు, రూ.15వేలు, రూ. 10 వేల నగదును అందచేస్తునట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన జాగృతి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల వెంకటపతి, కాండ్ర యువ నేస్తం సభ్యులు పీట్ల ప్రత్యూష్‌ కుమార్‌, ప్రకాష్‌, మత్స్యకార నాయకులు కొండయ్య జాలయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------

Updated Date - 2023-06-08T23:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising