విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
ABN, First Publish Date - 2023-03-13T22:20:07+05:30
పొలంలో బోరు వేస్తుండగా బోరు పైపుల(సెల్)కు 11కేవీలైన్ విద్యుత్ తీగలు తగిలి, సంగం మండలం తరుణవాయికి చెందిన గంధం హరీష్(23) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు.
గాయాలతో బయటపడిన మరో ఇద్దరు యువకులు
బుచ్చిరెడ్డిపాళెం,మార్చి13: పొలంలో బోరు వేస్తుండగా బోరు పైపుల(సెల్)కు 11కేవీలైన్ విద్యుత్ తీగలు తగిలి, సంగం మండలం తరుణవాయికి చెందిన గంధం హరీష్(23) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుచ్చిలోని ఓ లేఅవుట్‌లో సోమవారం జరిగింది. ఘటన జరిగిన వెంటనే పొలం యజమాని, మృతుల బంధువులు అక్కడి నుంచి మృతదేహాన్ని తరుణవాయికి తరలించారు. ఒళ్లు కాలిన ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం బుచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పొలం యజమాని, మధ్యవర్తి ఒప్పందంతో మృతదేహాన్ని తరుణవాయికి తరలించిన బంధువులు మధ్యస్థంపై చేతులెత్తేసినట్టు సమాచారం. దీంతో ఆ పంచాయితీ బుచ్చి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కాగా ఈ మేరకు బాధితులు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2023-03-13T22:20:07+05:30 IST