ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతితో వీరంపల్లిలో విషాదం

ABN, First Publish Date - 2023-05-03T21:47:31+05:30

ఇంజనీరింగ్‌ విద్యార్థి కూకర్ల ప్రణీత్‌(21) మృతితో మండలంలోని వీరంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంపల్లికి చెందిన కూకర్ల ప్రసాద్‌, ప్రభావతి దంపతులకు ఇద్దరు పిల్లలు, వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్ర

3ఎంబిఎల్‌ 3: ప్రణీత్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుబోలు, మే 3: ఇంజనీరింగ్‌ విద్యార్థి కూకర్ల ప్రణీత్‌(21) మృతితో మండలంలోని వీరంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంపల్లికి చెందిన కూకర్ల ప్రసాద్‌, ప్రభావతి దంపతులకు ఇద్దరు పిల్లలు, వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్రసాద్‌ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను ఇంజనీరింగ్‌ చదివిస్తున్నాడు. కుమారుడు ప్రణీత్‌ ఆదిశంకర కళాశాలలో ద్వితీయ సంవత్సరం, కుమార్తె మొదటి సంవత్సరం చదువుతున్నారు. రోజూ ఇద్దరు గ్రామం నుంచి మోటార్‌సైకిల్‌పై కళాశాలకు వెళ్లి వస్తుంటారు. మంగళవారం ఇంటి నుంచి బయలుదేరి చెల్లెల్ని ప్రణీత్‌ కళాశాలలో వదిలి గూడూరులోకి వెళ్లాడు. సాయంత్రం అవుతున్నా కళాశాల వద్దకు ప్రణీత్‌ రాకపోవడంతో చెల్లెలు తండ్రికి సమాచారం ఇచ్చింది. దీంతో ప్రసాద్‌ వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు. బుధవారం వేకువ 3గంటల వరకు ప్రణీత్‌ ఫోన్‌రింగ్‌ అవుతూనే ఉంది. తరువాత నుంచి ఆగిపోయింది. దీంతో అనుమానంతో ప్రణీత్‌ కోసం కుటుంబ సభ్యులు గాలింపు మొదలుపెట్టారు. చివరికి ప్రణీత్‌ తాళమ్మ గుడివెనుక రైల్వే ట్రాక్‌ సమీపంలో ఉన్న నీటిగుంటలో శవమై తేలాడు. దీంతో ప్రణీత్‌ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

--------

Updated Date - 2023-05-03T22:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising