వాడవాడలా కొనసాగుతున్న టీడీపీ రిలే దీక్షలు
ABN, First Publish Date - 2023-09-21T21:41:39+05:30
మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా 8వ రోజు గురువారం కావలి టీడీపీ కార్యాలయం వద్ద నేతలు దీక్షలు కొనసాగించారు. ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షల్లో నియోజకవర్గంలోని టీడీపీ ముస్లిం, మైనార్టీ నేతలు, మైనార్టీ విభాగం సభ్యులు కూర్చున్నారు. ఈ సందర్భంగా చం
కావలి, సెప్టెంబరు21: మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా 8వ రోజు గురువారం కావలి టీడీపీ కార్యాలయం వద్ద నేతలు దీక్షలు కొనసాగించారు. ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షల్లో నియోజకవర్గంలోని టీడీపీ ముస్లిం, మైనార్టీ నేతలు, మైనార్టీ విభాగం సభ్యులు కూర్చున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని కోరుతూ మధ్యాహ్నం ముస్లిం నేతలు నవాజ్ చేశారు. అనంతరం ముస్లిం మహిళలు కూడా దీక్షలో పాల్గొన్నారు. అవినీతిలో వైసీపీ రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా ఉందని మాలేపాటి దుయ్యబట్టారు. కావలి ఎమ్మెల్యే గ్రావెల్, ఇసుక, అక్రమలేఅవుట్లతో దోపిడీ చేస్తూ అవినీతిలో ముందువరుసలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు, నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
కందుకూరు : మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టు, కోర్టు విచారణ వ్యవహారంలో సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడని, ఆయన తగినమూల్యం చెల్లించక తప్పదని నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ కందుకూరులో తలపెట్టిన రిలే దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు,బలహీనవర్గాల అభివృద్ధికి బీజం వేసింది టీడీపీయేనని అన్నారు.కార్యక్రమంలో ఎస్సీసెల్ నాయకులు కాకి ప్రసాదరావు, రాయపాటి శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య, రెబ్బవరపు మాల్యాద్రి, గోచిపాతల మోషే, పులి నాగరాజు, దార్ల శ్రీను, తాటిపర్తి రామకృష్ణ, రావినూతల రమేష్, తాళ్లూరి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.
కలిగిరి : స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద గురువారం మాజీ సీఎం చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ అక్రమ అరెస్టును తాము ఎన్నటికి మరువలేమన్నారు. అనంతరం సీతారామపురం మండల కన్వీనర్ కప్పా ప్రభాకర్ రాజు ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమలో నేతలు బిజ్జం కృష్ణారెడ్డి, కాకు మహేష్, గంగవరపు మధన్ కుమార్, ఊసా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు రాసిన పోస్టుకార్డులను పోస్టాఫీసు ద్వారా చంద్రబాబుకు పంపారు.
లింగసముద్రం : మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా కందుకూరులోని టీడీపీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన ఎస్సీల నిరసన దీక్షలకు మండలంలోని పలు గ్రామాల ఎస్సీ శ్రేణులు తరలివెళ్లాయి. మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాళ్లూరి ముసలయ్య, ప్రధాన కార్యదర్శి పూరిమిట్ల మాల్యాద్రి, పార్లమెంటు ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి అంగుళూరి చిన కొండయ్య, లింగసముద్రం గ్రామ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్‌లతోపాటు పలువురు ఎస్సీ నాయకులు తరలి వెళ్లారు.ఈ సందర్భంగా దీక్షలో పూరిమిట్ల మాల్యాద్రి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుఫాన్‌రావు, రొడ్డా నాగేశ్వరరావు, చింతపల్లి అర్జున్, తదితరులు పాల్గొన్నారు.
----------------
Updated Date - 2023-09-21T21:41:39+05:30 IST