బీసీలను మోసం చేస్తున్న వైసీపీ
ABN, First Publish Date - 2023-04-04T21:45:10+05:30
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు మురళీ కన్నబాబు తెలిపారు.
ఆత్మకూరు, ఏప్రిల్ 4 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు మురళీ కన్నబాబు తెలిపారు. పట్టణంలోని నేతాజీ క్లబ్‌లో మంగళవారం నియోజకవర్గ వడ్డెర సాధికార సమితి కన్వీనర్ చల్లా మాల్యాద్రి అధ్యతన టీడీపీ వడ్డెర ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిధులు లేని కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు. వడ్డెర కులస్థులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. బీసీలకు పనిముట్లు, సబ్సిడీ రుణాలు అందజేసి వారి ఆర్థిక బలోపేతానికి తోడ్పాటు నందించిన ఘనత టీడీపీదేనన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావా పెంచలరావు, చండ్రా వెంకటసుబ్బానాయుడు, బెల్లంకొండ శ్రీనివాసులు, బండి ప్రసాద్, పల్లవోలు జయకర్, మున్సిపల్ కౌన్సిలర్ షేక్ గౌస్‌బాషా, ఖాదర్‌బాష, నందా మోహన్, షేక్ మీరా మొహిద్దీన్, షేక్ రబ్బాని, తమ్మిశెట్టి వెంకరమణ, ఇర్ల మాధవ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-04-04T21:45:10+05:30 IST