ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని రాస్తారోకో
ABN, First Publish Date - 2023-09-21T21:48:27+05:30
ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని మండలం ఎంఆర్‌పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. మన్నేటికోట అడ్డరోడ్డు జాతీయ రహ
ఉలవపాడు, సెప్టెంబరు 21 : ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని మండలం ఎంఆర్‌పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. మన్నేటికోట అడ్డరోడ్డు జాతీయ రహదారిపై నిరసన తెలుపుతూ వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ మహాజన సోషలిస్టు పార్టీ ఇన్‌చార్జి రావినూతల ముత్తుమాదిగ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, 9 ఏళ్లు అయినా ఇప్పటికి ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు గౌడుపేరు కాంతారావు మాదిగ, చదలవాడ కిట్టు మాదిగ, ఆశీర్వాదం, ఏలియా, సురేంద్ర, జూషువా, వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
--------------
Updated Date - 2023-09-21T21:48:27+05:30 IST