ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సజ్జలా.. బెదిరేదిలే

ABN, First Publish Date - 2023-02-05T06:26:38+05:30

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంద మందితో తిట్టించినా అదిరేది లేదు

నాకు ఫోన్లు వస్తే.. నీకు వీడియో కాల్సే వస్తాయి

నాపై తప్పుడు కేసులు పెట్టడం మొదలైంది

బావా కాకాణి.. బాబు కాళ్లు పట్టుకోలా

ముందు నకిలీ పత్రాల కేసు చూసుకో

సీబీఐ వాళ్లు తిరుగుతున్నారు: కోటంరెడ్డి ఫైర్‌

శ్రీఽధర్‌ రెడ్డికి నెల్లూరు మేయర్‌ సంఘీభావం

కోరితే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టీకరణ

నెల్లూరు (ఆంధ్రజ్యోతి), నెల్లూరు (క్రైం), ఫిబ్రవరి 4: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బోడబండ్ల అనిల్‌ అనే వ్యక్తి ద్వారా సజ్జల తనకు ఫోన్‌ చేయించి తిట్టించారని, ఇలాంటి ఫోన్లు చాలా వస్తున్నాయన్నాని ఆరోపించారు. శనివారం నెల్లూరులోని తన కార్యాలయంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘సజ్జల రామకృష్ణారెడ్డి.. లైవ్‌ చూస్తున్నావా? వింటున్నావా? నీకు ఇప్పుడే చెబుతున్నా.. ఇలాంటి వారిని వంద మందిని పంపించినా, వంద మంది చేత తిట్టించినా నేను అదిరేది లేదు, బెదిరేది లేదు. ఇకపై నాకు ఇలాంటి ఫోన్లు వస్తే నెల్లూరు రూరల్‌ నుంచి నీకు వీడియో కాల్సే వస్తాయి జాగ్రత్త. నాపై తప్పుడు కేసులు పెట్టడం ప్రారంభమైంది. ఒక కార్పొరేటర్‌ కిడ్నాపునకు ప్రయత్నించానని కేసు పెట్టించారు. సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడే చెబుతున్నా ఇలాంటి కేసులు వంద పెట్టినా నేను భయపడేదే లేదు. నన్ను కెలకకుండా ఉంటే నెల్లూరు రూరల్‌లో నా పని నేనుచేసుకొని పోతా. కెలికితే మాత్రం ఎంత దూరానికైనా వెళ్తా’’ అని కోటంరెడ్డి హెచ్చరించారు.

కాకాణి.. ఆ రోజు ఏమన్నావు?

‘‘బావా కాకాణి.. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష పార్టీ వైపు వెళుతున్నా. నీలా వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కాళ్లు పట్టుకోలేదు. నేను చేసింది నమ్మక ద్రోహం అయితే ఆనం రామనారాయణరెడ్డి విషయంలో నువ్వు చేసింది ఏమిటి? నిన్ను జడ్పీ చైర్మన్‌గా చేసింది ఆయన. నీకు రాజకీయంగా భిక్షపెట్టిన ఆనంకు నువ్వు చేసింది ఏమిటి? ఆయనకు ఎంత క్షోభ పెట్టావో జిల్లా ప్రజలందరికి తెలుసు. నకిలీ మద్యం కేసులో వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు కాళ్లు పట్టుకున్నది ఎవరో జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు వైఎస్‌ కుటుంబం గురించి, జగన్‌ రెడ్డి గురించి గొప్పగా చెబుతున్న కాకాణి ఓదార్పు యాత్ర సందర్భంగా ఏం మాట్లాడారో నాకు, భూమన కరుణాకరరెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తెలుసు. కాంగ్రెస్‌ ఒక మహాసముద్రం, జగన్‌ ఒక నీటి బిందువు, ఆయనతో వెళితే భవిష్యత్తే లేకుండా పోతారని ఆ రోజు అన్నావా? లేదా? నీ సొంత మండలం పొదలకూరులో వైఎస్‌ విగ్రహం పెట్టనివ్వకుండా అడ్డుకున్నది నువ్వు కాదా? ముందు నకిలీ పత్రాల కేసు గురించి చూసుకో. దేశంలో ఎక్కడా జరగని నేరం నెల్లూరు కోర్టులో జరిగింది. కోర్టులో అన్ని వేల కాగితాలు ఉండగా ఒక్క కాకాణి కేసు కాగితం మాత్రమే ఎలా మాయమైందని వేలాదిమంది ప్రశ్నిస్తున్నారు. సీబీఐ అధికారులు నెల్లూరుకు తిరుగుతున్నారు. ఎవరెవరినో విచారిస్తున్నారు జాగ్రత్త బావా?’’ అంటూ కోటంరెడ్డి మండిపడ్డారు.

శ్రీధర్‌ అన్నతోనే ఉంటాం: మేయర్‌

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వెంటే ఉంటామని నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ పొట్లూరి స్రవంతి స్పష్టం చేశారు. ‘‘ఏది ఏమైనా శ్రీధర్‌ అన్నతోనే ఉంటాం. ఆయన ఎటు (ఏ పార్టీ) వెళితే అటు వెళ్తాం. శ్రీధర్‌రెడ్డి కోరితే మేయర్‌ పదవికి సంతోషంగా రాజీనామా చేస్తా. మా జెండా, అజెండా శ్రీధర్‌రెడ్డే’’ అని స్రవంతి అన్నారు.

శ్రీధర్‌రెడ్డికి సెక్యూరిటీ కుదింపు

వైసీపీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సెక్యూరిటీ కుదించారు. ఇప్పటి వరకు టూ ప్లస్‌ టూ గన్‌మెన్‌ ఉండగా, ఆ సంఖ్యను వన్‌ ప్లస్‌ వన్‌కు తగ్గించారు. ఇటీవలే మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సెక్యూరిటీని కూడా కుదించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.

Updated Date - 2023-02-05T06:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising