సర్వీసు రోడ్లను ఉపయోగించని ఆర్టీసీ
ABN, First Publish Date - 2023-02-04T23:22:38+05:30
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జాతీయ రహదారుల సంస్థ జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో సర్వీసు రోడ్లను నిర్మించింది.
వెంకటాచలం, ఫిబ్రవరి 4 : జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జాతీయ రహదారుల సంస్థ జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో సర్వీసు రోడ్లను నిర్మించింది. ఈ రోడ్ల పక్కన బస్సు షెల్టర్లను కూ డా ఏర్పాటు చేసింది. గతం కంటే రోడ్లు బాగుండడం, వాహనాల రద్దీ పెరగడం వల్ల బస్సులను మెయిన్ రోడ్డులో ఆపితే ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఈ సర్వీసు రోడ్లను ఏర్పాటు చేసింది. అయితే ఆర్టీసీ బస్సులు ఈ రోడ్లను ఉపయోగించడం లేదు. దీంతో రహదారి వెంట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులను దించడానికి బస్సులను ఆర్టీసీ సిబ్బంది మెయిన్ రోడ్డుపైనే ఆపివేస్తున్నారు. దీంతో వెనకవైపు నుంచి వచ్చే వాహనాలు బస్సులను వెనక వైపు నుంచి ఢీకొట్టున్నాయి. బస్సు దిగిన వారు బస్సు ముందు నుంచి రహదారిని దాటే యత్నం చేస్తూ ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. గతంలో వెంకటా చలంలో ఇదే తరహాలో ఎంతో మంది ప్రమాదాల బారిన పడ్డారు. కసుమూరు రోడ్డు, సర్వేపల్లి రోడ్డు కూడళ్లలో ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతు న్నాయి. ఇటీవల కసుమూరు రోడ్డు సెంటరులో ఆర్టీసీ బస్సు మెయిన్ రో డ్డుపై ఆగగా వెనకవైపు నుంచి వచ్చిన మోటారు సైకిల్ ఢీకొంది. కసుమూరు రోడ్డు కూడలిలో బస్సు నుంచి ప్రయాణికులు దిగే సమయంలోనూ బస్సును వెనకవైపు నుంచి వ చ్చిన లారీ ఢీకొంది. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇలాంటి ప్రమా దాలైతే ఏడాదిలో చాలానే చోటుచేసుకుని ఉన్నాయి. బస్సులను సర్వీసు రోడ్ల లో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదం టే మరిన్ని ప్రమా దాలు జరిగే అవకాశముందని ఆందోళన చెందు తున్నారు.
Updated Date - 2023-02-04T23:22:39+05:30 IST