ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఎస్‌యూలో పొగాకు వ్యతిరేక దినోత్సవం

ABN, First Publish Date - 2023-05-31T21:49:11+05:30

మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో బుధవారం జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సుందరవల్లి పొగాకు కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఆమె మాట్లా

31వీకేటీ3 : పొగాకుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న వీసీ సుందరవల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, మే 31 : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో బుధవారం జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సుందరవల్లి పొగాకు కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఆమె మాట్లాడుతూ పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టామేనని, అధికంగా పొగాకు తీసుకోవడం వల్ల శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ డాక్టర్‌ పీ రామచంద్రారెడ్డి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ విజయానంద్‌ కుమార్‌బాబు, కే సునీత, సుజాఎస్‌ నాయర్‌, డాక్టర్‌ సాయిప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ హనుమారెడ్డి, డాక్టర్‌ శ్రీకన్యా రావు తదితరులు పాల్గొన్నారు.

పొదలకూరు : మండల వైద్యాధికారి రమేష్‌ ఆధ్వర్యంలో బుధవారం మహమ్మదాపురంలోని పీహెచ్‌సీలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు పొగాకు వాడకం వలన కలిగే అనర్థాల గురించి ఆయన అవగాహన కల్పించారు. అనంతరం పొగాకు జోలికి పోవద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లింగంపల్లి ప్రభుత్వ బాలుర హాస్టల్‌లో దోమల నివారణకు మందును పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఆదిలక్ష్మి, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ ఆంజనేయవర్మ, ఆరోగ్య విస్తరణ అధికార రవికుమార్‌, ఆరోగ్య సహాయకులు వెంకటేశ్వర్లు, చిత్ర, అరుణ, ఆశా కార్యకర్తలు రమణమ్మ, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T21:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising