ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరమ్మతులు చేయరూ..

ABN, First Publish Date - 2023-02-19T22:52:04+05:30

సచివాలయ వ్యవస్థ ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పే ప్రభుత్వ మాటలు ఆచరణలో మాత్రం నీటి మూటలుగానే మిగులుతున్నాయి

నిరుపయోగంగా మారిన కంప్యూటరు, ప్రింటరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, ఫిబ్రవరి 19: సచివాలయ వ్యవస్థ ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పే ప్రభుత్వ మాటలు ఆచరణలో మాత్రం నీటి మూటలుగానే మిగులుతున్నాయి. కనీసం చిన్నపాటి సేవలు కూడా అందే పరిస్థితి లేకపోవడంతో రోజుల తరబడి అధికారుల చుట్టూ ప్రద క్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని పెద్దిరెడ్డిపల్లి సచివాల యానికి ప్రభుత్వం కేటాయించిన రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు నెలల తర బడి మరమ్మతులకు గురయ్యాయి. ఈ విషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకొనే నాథుడే కరువయ్యారంటూ సిబ్బంది సైతం వాపోతున్నారు. దీంతో దుమ్ము, ధూళితో నిండిన ఆ కంప్యూటర్లు, ఇతరత్రా సామగ్రి నిరుప యోగంగా దర్శనమిస్తున్నాయి. కనీసం సిబ్బంది కూడా వీటిపై శ్రద్ధ చూపడం లేదని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాగోలా పనులు చేయాలనే తాపత్రయంతో సమీప ఆర్బీకేలోని కంప్యూటర్‌, ప్రింటర్‌ను సచివాలయానికి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ ప్రింటర్‌ సైతం మొరాయించడంతో అక్కడి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చం దంగా మారింది. కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నమోదు చేసిన సిబ్బంది ధ్రువీకరణ పత్రాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సలహాలు ఇస్తుం డడంతో చేసేదేమిలేక వాటికోసం సమీప సచివాలయాలకు పరుగులు తీయా ల్సి వస్తుందని అర్జీదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించి మరమ్మతులకు గురైన కంప్యూటర్లు, ప్రింటర్లను వినియోగం లోకి తీసుకొచ్చి సచివాలయ సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2023-02-19T22:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising