ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేత పోరంబోకును మింగేశారు !

ABN, First Publish Date - 2023-02-06T21:16:03+05:30

సీతారామపురం పంచాయతీలోని సర్వే నెంబరు 1లో గల 431. 29 ఎకరాల మేతపోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గతంలో ఆందోళన చేశారు. అయితే అక్రమార్కులపై జిల్లా ఉన్నతాఽధికారులు చర్యలు ఎప్పుడు తీసుకుంటారని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేతపోరం

అన్యాక్రాంతానికి గురైన మేతపోరంబోకు భూమి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతారామపురం, ఫిబ్రవరి 6: సీతారామపురం పంచాయతీలోని సర్వే నెంబరు 1లో గల 431. 29 ఎకరాల మేతపోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గతంలో ఆందోళన చేశారు. అయితే అక్రమార్కులపై జిల్లా ఉన్నతాఽధికారులు చర్యలు ఎప్పుడు తీసుకుంటారని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేతపోరంబోకులో 47. 92 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు తెరవెనుక పెద్ద ప్రయత్నాలు జరిగినట్లు, అందుకు నాటి రెవెన్యూ అధికారులు కీలకపాత్ర పోషించి తమ వంతు సహకారాన్ని అందించినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో రామిరెడ్డి చెంచురామిరెడ్డి అనే వ్యక్తి సర్వే నెంబరు 1లో గల మేతపోరంబోకు భూమి తనదేనని పత్రాలు సృష్టించాడు. అతడు ఆ భూమిని తన కూతురు పాలిచెర్ల శేషమ్మకు రాసి ఇచ్చాడు. ఆమె కూడా ఆ భూమిని వెలిశెట్టి సూర్యకుమారి అనే మహిళకు విక్రయించింది. తిరిగి ఆ భూమిని 2001లో సూర్యకుమారి నుంచి అజిత్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించమని అజిత్‌ శ్రీనివాస్‌ సూర్యకుమారిపై ఆత్మకూరు కోర్టులో కేసు వేశారు. లోక్‌అదాలత్‌లో అజిత్‌ శ్రీనివాస్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ భూమిని గత ఏడాది డిసెంబరులో రిజిసే్ట్రషన్‌ చేసినట్లు సమాచారం. దీంతో మేతపోరంబోకు భూమి అన్యాక్రాంతం అయినట్లు తెలియడంతో స్ధానికులు ఆందోళనకు దిగారు. చివరకు భూమి కొనుగోలు చేసినవారు అక్కడికి రావడంతో విషయం బయటకు పొక్కింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఆక్రమణదారులపై చర్యలు తప్పవు

మేత పోరంబోకు భూమి అన్యాక్రాంతంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆక్రమణదారులపై తప్పకుండా చర్యలు చేపడతాం. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాం.

- షాజియా, తహసీల్దార్‌

----------------

Updated Date - 2023-02-06T21:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising