బైపాస్‌ను వదిలేసి లేఅవుట్లకు ఖర్చుచేస్తారా..?
ABN, First Publish Date - 2023-04-03T21:44:41+05:30
సీసీరోడ్డుకు మార్కింగ్ చేసిన బైపాస్‌రోడ్డును గాలికొదిలేసి శేషాద్రినగర్ లేఅవుట్ అభివృద్ధి కోసం కోసం రూ. కోట్లు ఖర్చుచేస్తారా...అని నగర పంచాయతీ కమిషనర్ చంద్రశే
ఫ కమిషనర్‌ను ప్రశ్నించిన టీడీపీ నేతలు
బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్3: సీసీరోడ్డుకు మార్కింగ్ చేసిన బైపాస్‌రోడ్డును గాలికొదిలేసి శేషాద్రినగర్ లేఅవుట్ అభివృద్ధి కోసం కోసం రూ. కోట్లు ఖర్చుచేస్తారా...అని నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డిని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ సమస్యలపై నేతలు వినతిపత్రం సమర్పించారు. చెన్నూరురోడ్డు పగలగొట్టి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. నగర పంచాయతీలో నిధులు, ఖర్చులు, అధిక పన్నుల వసూళ్లు, డ్రైన్లు, జగనన్న ఇళ్లలో నాసిరకం నిర్మాణాలు, నిధుల దుర్వినియోగం, రోడ్ల దుస్థితి తదితర సమస్యలను వారు కమిషనర్‌ను నిలదీశారు. వారంలో సరైన సమాధానం రాకుంటే ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎంవీ.శేషయ్య, డీ హరనాఽథ్, ప్రభాకర్‌రెడ్డి, రామానాయుడు, కొండయ్య, కోదండరామిరెడ్డి, పురుషోత్తం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
----------
Updated Date - 2023-04-03T21:44:41+05:30 IST