ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో వ్యవస్థలు సచ్చిపోయాయి

ABN, First Publish Date - 2023-06-10T23:06:47+05:30

వైసీపీ నాలుగేళ్లలో పాలనలో జిల్లాలో రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌, పోలీసు వ్యవస్థలు సచ్చిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని కాకుటూరులో శనివారం 70 కుటుంబాలు సోమిరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదారంగా ఆహ్వానించారు.

వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారితో మాజీ మంత్రి సోమిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, జూన్‌ 10 : వైసీపీ నాలుగేళ్లలో పాలనలో జిల్లాలో రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌, పోలీసు వ్యవస్థలు సచ్చిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని కాకుటూరులో శనివారం 70 కుటుంబాలు సోమిరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదారంగా ఆహ్వానించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ అవినీతి, అక్రమాలు, దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంటే వాటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలే వైసీపీకి బానిసలా మారి పనిచేస్తుండటం దురదృష్టకరమన్నారు. సర్వేపల్లి నియోజక వర్గంలో దోపిడీ, అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు. నాలుగేళ్లలో మంత్రి కాకాణి సాధించింది కేవలం బూడిద, ఇసుక, గ్రావెల్‌ దోపిడీ, భూ కుంభకోణాలు తప్ప.. మరొకటి లేదన్నారు. కనుపూరు చెరువుకు రెండో పంటకు సాగునీరు ఇవ్వకుండా గ్రావెల్‌ వ్యాపారం చేసుకుంటున్నారని, దీనివల్ల గుంతలు ఏర్పడి మూగజీవాలు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. కాగా రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని వెంకటాచలం సీఐ నోటికి వచ్చినట్లు రైతులను దూషించడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు లాభం చేకూరుతుందన్నారు. ఇప్పటికే నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు రాయలసీమలో ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నెల్లూరులో ప్రజలు మరింతగా బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో గుమ్మడి రాజాయాదవ్‌, ఎం. శ్రీనివాసులునాయుడు, డబ్బుగుంట సురేంద్ర, కోదండయ్యనాయుడు, డబ్బుగుంట మల్లికార్జున్‌, బండి శీనయ్య, ఆత్మకూరు వెంకట సుబ్బయ్య, చాన్‌బాషా, మల్లి క్రిష్టయ్య, ఆది, శ్రావణ్‌, దిలీప్‌ తదితరులున్నారు.

==========

Updated Date - 2023-06-10T23:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising