ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేధింపులు, కక్ష సాధింపులు

ABN, First Publish Date - 2023-02-02T12:05:19+05:30

నెల్లూరు: జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం దుమారం రేపుతోంది. ట్యాపింగ్ జరిగిందని ఆధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేధింపులు, కక్ష సాధింపులు మొదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం దుమారం రేపుతోంది. ట్యాపింగ్ జరిగిందని ఆధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి వేధింపులు, కక్ష సాధింపులు మొదలయ్యాయి. కోటంరెడ్డికి ఏ పని చేయొద్దంటూ జిల్లా అధికారులకు పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. సీనియర్ నేతలకే వేధింపులు మొదలవ్వడంతో జిల్లా ప్రజా ప్రతినిధులు ఆందోళనలో ఉన్నారు. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయేమోనని భయపడుతున్నారు. సొంతపార్టీ పెద్దల తీరుపై లోలోన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్యాపింగ్ నిరూపణ జరిగితే వైసీపీ ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే చర్చ జరుగుతోంది. గతంలో ట్యాపింగ్ వ్యవహారాలు ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీ వర్గాల్లో ట్యాపింగ్ అంశమే ప్రధాన చర్చగా మారింది. మరోవైపు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో గురువారం సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి..

వీఎస్టీలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా

ఆంధ్రప్రదేశ్‌లో మునిగిపోతున్న నావను కాపాడ్డానికి అధికార వైసీపీ (YCP) ఆపసోపాలు పడుతోంది. ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్లు తిరుగుబాటు ప్రకటించడం.. కొందరైతే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం.. అన్నింటికి మించి గతంలో ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశాని ఇవాళ ఏపీ (AP)లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తడం కలకలంరేపుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే అవన్ని నిరాధారాలని.. వెళ్లిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారని మరో సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) అన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరించిన కోటంరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టిన విషయం తెలిసిందే

Updated Date - 2023-02-02T12:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising