ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రావెల్‌ తరలింపుపై ఇరువర్గాల ఘర్షణ

ABN, First Publish Date - 2023-01-30T22:29:57+05:30

: బోగోలు మండలంలో గ్రావెల్‌ అక్రమ తరలింపుపై పొత్తులు కుదరక ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, ఈ విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోగోలులోని లేఆవుట్లకు గ్రావెల్‌ను అక్రమంగా తరలించే విషయం

పగిలిన పోలీస్‌స్టేషన్‌ కిటికీ అద్దాలను తొలగిస్తున్న స్వీపర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట, జనవరి 30: బోగోలు మండలంలో గ్రావెల్‌ అక్రమ తరలింపుపై పొత్తులు కుదరక ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, ఈ విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోగోలులోని లేఆవుట్లకు గ్రావెల్‌ను అక్రమంగా తరలించే విషయంలో ఆదివారం రాత్రి స్థానికులు టిప్పర్లను అడ్డుకున్నారు. గ్రావెల్‌ తవ్వకాలకు మహేష్‌నాయుడు తెచ్చిన ఎక్స్‌కవేటర్‌ అద్దాలను గుర్తుతెలియనివ్యక్తులు పగలకొట్టారు.ఈ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. బోగోలుకు చెందిన సముద్రాల క్రాంతి, అరవ సాయిలు ఎక్స్‌కవేటర్‌ అద్దాలు బద్దాలు కొట్టిన విషయమై అల్లిమడుగు సంఘానికి చెందిన బొచ్చు ప్రభుసాయి ఇంటివద్దకు వెళ్లి గొడవ పడటంతో వాతావరణం వేడెక్కింది. మాటామాటా పెరగడంతో ప్రభుసాయిపై వారు కత్తితో దాడిచేసి గాయపరిచారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కావలి ఏరియా వైధ్యశాలకు తరలించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు ఇరువర్గాలను పంపించడంతో అక్కడ నుంచి క్రాంతి, సాయిలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కిటికీ అద్దాలు బద్దలు కొట్టి, పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని ఏఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపారు. గాయపడిన ప్రభుసాయి, విధుల్లో ఉన్న పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.

---------------

Updated Date - 2023-01-30T22:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising